- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఏజెన్సీల్లో హైలర్ట్.. హిట్ లిస్ట్‌లో ఉన్న నేతలకు పోలీసుల కీలక ఆదేశాలు
తెలంగాణలోని ఏజెన్సీల్లో పోలీసులు హై అలర్ట్ ప్రకటించారు.

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలో గురువారం పోలింగ్ జరగనున్న నేపథ్యంలో ఏజెన్సీల్లో పోలీసులు హై అలర్ట్ ప్రకటించారు. ఎన్నికలు బహిష్కరించాలని మావోయిస్టులు పిలుపునిచ్చారు. మావోయిస్ట్ యాక్షన్ టీమ్ కదలికలతో పోలీసులు అప్రమత్తమయ్యారు. తెలంగాణ-ఛత్తీస్‌గఢ్ సరిహద్దులో సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోంది. మావోయిస్ట్ యాక్షన్ టీమ్ కదలికలపై పోలీసులు నిఘా ఉంచారు. గోదావరి తీర ప్రాంతాన్ని పోలీసులు జల్లెడ పడుతున్నారు. భద్రాచలం ఏజెన్సీలో హై అలర్ట్ ప్రకటించారు. సురక్షిత ప్రాంతాల్లో ఉండాలని హిట్ లిస్ట్‌లో ఉన్న నేతలకు పోలీసులు ఆదేశాలు జారీ చేశారు. చర్ల, దుమ్ముగూడెం మండలాల్లో భద్రత కట్టుదిట్టం చేశారు. పోలింగ్ కేంద్రాలను పోలీసు బలగాలు ఆధీనంలోకి తీసుకున్నాయి.
తెలంగాణ ఎన్నికలకు భారీగా భద్రత
తెలంగాణ ఎన్నికలకు పోలీసులు భారీగా భద్రతా ఏర్పాట్లు చేశారు. ఎన్నికల విధుల్లో లక్షమంది పోలీసు సిబ్బంది పాల్గొననున్నారు. 4,400 సమస్యాత్మక ప్రాంతాల్లో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎన్నికల విధుల్లో 375 కంపెనీల కేంద్ర బలగాలు రంగంలోకి దిగనున్నాయి. ఎన్నికలు ముగిసే వరకు హైదరాబాద్ లో 144 సెక్షన్ కొనసాగుతోంది. ఐదుగురికి మించి గుమిగూడితే చర్యలు తీసుకుంటామని సీపీ హెచ్చరించారు. పోలింగ్ ప్రక్రియ ముగిసే వరకు మద్యం షాపులు బంద్ ఉండనున్నాయి.






