- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అలర్ట్: మూడు రోజులు వర్షాల మోత... ఎండల దెబ్బ తగ్గదు!
రాష్ట్రంలో రాగల మూడు రోజులు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో రాగల మూడు రోజులు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. పలు జిల్లాల్లో 40 నుండి 50 కి.మీ వేగంతో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. వర్ష సూచన ఉన్నప్పటికీ, పగటిపూట ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబ్ నగర్, సంగారెడ్డి, కామారెడ్డి జిల్లాలలో వడగళ్ల వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆయా జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఆదిలాబాద్, జగిత్యాల, జోగులాంబ గద్వాల్, కామారెడ్డి, కరీంనగర్, కుమురం భీం, మహబూబ్ నగర్, మంచిర్యాల, మెదక్, నాగర్ కర్నూల్, నిర్మల్, నిజామాబాద్, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల, సంగారెడ్డి, వికారాబాద్, వనపర్తి, జిల్లాల్లో అధిక ఎండలు ఉండే అవకాశం ఉంది. ఈ జిల్లాలకు ఎండ తీవ్రత దృష్ట్యా ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు.
కామారెడ్డిలో 4 సెం.మీ ల వర్షం
సోమవారం కామారెడ్డిలో 5 సెం.మీ, కామారెడ్డి జిల్లా బిక్నూర్ లో 4 సెం.మీ, సంగారెడ్డి జిల్లా కందిలో 4 సెం.మీ, సంగారెడ్డిలో 3 సెం.మీ, మెదక్ జిల్లా రామాయంపేట లో 3 సెం.మీ, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా మేడ్చల్ లో 3 సెం.మీ, సంగారెడ్డి జిల్లా కొండాపూర్ లో 2 సెం.మీ, వికారాబాద్ జిల్లా మర్పల్లెలో 2 సెం.మీ, మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా హకీంపేట్ లో 2 సెం.మీ చొప్పున వర్షపాతం నమోదైంది.
నమోదైన ఉష్ణోగ్రతలు:
ప్రాంతం నమోదైన ఉష్ణోగ్రత
ఆదిలాబాద్ 43.8
భద్రాచలం 40
హకీంపేట్ 40.8
దుండిగల్ 40.9
హన్మకొండ 38.5
హైదరాబాద్ 40.7
ఖమ్మం 40.4
మహబూబ్ నగర్ 41.4
మెదక్ 40
నల్గొండ 40.5
నిజామాబాద్ 43.1
రామగుండం 39.7
పటాన్చెరు 39.6
రాజేంద్రనగర్ 40
హయత్ నగర్ 40






