తెలంగాణ బీసీ విద్యార్థులకు అలర్ట్

by Gantepaka Srikanth |

తెలంగాణ బీసీ విద్యార్థులకు అలర్ట్

తెలంగాణ బీసీ విద్యార్థులకు అలర్ట్
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలోని బీసీ మరియు ఇతర విద్యార్థులకు విదేశాలలో ఉన్న అత్యున్నత విశ్వ విద్యాలయాలలో ఉన్నత విద్యను అభ్యసించేందుకు గల అవకాశాలను మరియు విదేశాలలో ఉన్నత విద్యను అభ్యసించేందుకు ఇవ్వబడుతున్న అంతర్జాతీయ స్కాలర్ షిప్పులు పొందడం లక్ష్యంగా నిర్మాణాత్మక అవగాహన సెషన్లు, శిక్షణా కార్యక్రమాలను తెలంగాణ బీసీ స్టడీ సర్కిల్ ప్రారంభించడం జరుగుతుందని బీసీ స్టడీ సర్కిల్స్ డైరెక్టర్ శ్రీనివాస్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా రాష్ట్రంలోని 12 బీసీ స్టడీ సర్కిల్స్ విదేశాలలో ఉన్నత విద్యను అభ్యసించేందుకు గల అవకాశాలను వివరించేందుకు అవగాహన కార్యక్రమాలను మరియు IELTS శిక్షణ తరగతులు ప్రారంభించడం జరుగుతుందని శ్రీనివాస్ రెడ్డి వెల్లడించారు.

ఈ అవగాహన కార్యక్రమాలకు మరియు IELTS శిక్షణ తరగతులుకు హాజరు కావడానికి ఆసక్తి ఉన్న గ్రాడ్యుయేషన్ (ప్రొఫెషనల్ మరియు నాన్ ప్రొఫెషనల్) ఉత్తీర్ణత పొందిన అభ్యర్థులు డిసెంబర్ 1వ తేదీ నుంచి డిసెంబర్ 21వ తేదీ వరకు టీజీబీసీ స్టడీ సర్కిల్ వెబ్సైట్ "http://tgbcstudycircle.cgg.gov.in" ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. మరింత సమాచారం http://Ph.No.040-24071178 ద్వారా తెలుసుకోవచ్చని శ్రీనివాస్ రెడ్డి తెలిపారు.

Next Story