విద్యార్థులకు అలర్ట్.. నేటి నుంచే ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు

by velandi.Saikiran |

ఇవాళ్టి నుంచి ఇంటర్ అడ్వాన్సుడ్ సప్లిమెంటరీ పరీక్షలు షురూ కానున్నాయి.

విద్యార్థులకు అలర్ట్.. నేటి నుంచే ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు
X

దిశ‌, వెబ్ డెస్క్: తెలంగాణ ఇంటర్ విద్యార్థులకు బిగ్ అలర్ట్. ఇవాళ్టి నుంచి ఇంటర్ అడ్వాన్సుడ్ సప్లిమెంటరీ పరీక్షలు షురూ కానున్నాయి. ఈ మేరకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. షెడ్యూల్ ప్రకారం ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఫస్ట్ ఇయర్ పరీక్షలు జరగనుండగా.. మధ్యాహ్నం 2:30 నుంచి సాయంత్రం ఐదున్నర గంటల వరకు సెకండియర్ పరీక్షలు ఉంటాయి.

నిమిషం ఆల‌స్యమైనా నో ఎంట్రీ

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ సప్లిమెంటరీ పరీక్షల కోసం 889 కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఇంటర్ ఫస్టియర్ లో 2,67,285 మంది, సెకండ్ ఇయర్ లో 1,31,073 మంది సహా మొత్తం 3,98,358 మంది విద్యార్థులు ఈ ప‌రీక్ష‌లు రాస్తున్నారు. పరీక్షా సమయానికి నిమిషం ఆలస్యమైనా ఎంట్రీ ఉండబోదని అధికారులు స్పష్టం చేశారు. నేటి నుంచి ప్రారంభం కాబోతున్న ఈ సప్లిమెంటరీ పరీక్షలు మే 28వ తేదీతో ముగుస్తాయి.

Next Story