- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
S CT ఎస్ఐ అభ్యర్థులకు అలర్ట్.. ఇవాళ్టి నుంచే!
తెలంగాణ స్టేట్ లెవల్ పోలీస్ రిక్రూట్ మెంట్ బోర్డు కీలక ప్రకటన చేసింది. ఈ నెల 26న జరగనున్న ఎస్ సీటీ ఎస్ఐ టెక్నికల్ పేపర్ రాత పరీక్షకు హాల్ టికెట్లు ఇవాళ(మార్చి 21) ఉదయం 8 గంటల నుంచి అందుబాటులో ఉంచబోతున్నట్లు తెలిపింది.

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణ స్టేట్ లెవల్ పోలీస్ రిక్రూట్ మెంట్ బోర్డు కీలక ప్రకటన చేసింది. ఈ నెల 26న జరగనున్న ఎస్ సీటీ ఎస్ఐ టెక్నికల్ పేపర్ రాత పరీక్షకు హాల్ టికెట్లు ఇవాళ(మార్చి 21) ఉదయం 8 గంటల నుంచి అందుబాటులో ఉంచబోతున్నట్లు తెలిపింది. మార్చి 24వ తేది అర్థరాత్రి 12 గంటల వరకు అభ్యర్థులు https://www.tslprb.in/ వెబ్ సైట్ ద్వారా ఈ హాల్ టికెట్లు డౌన్ లోడ్ చేసుకునేందుకు వీలుంటుందని రిక్రూట్ మెంట్ బోర్డు ఓ ప్రకటనలో పేర్కొంది. డౌన్ లోడ్ చేసుకున్న హాల్ టికెట్‌పై అభ్యర్థులు తమ పాస్ పోర్ట్ సైజ్ ఫోటో అతికించాలని, ఫోటో లేని వారిని పరీక్షకు అనుమతించబోమని అధికారులు హెచ్చరించారు. ఎవరికైనా హాల్ టికెట్లు డౌన్ లోడ్ కాకుంటే అలాంటి అభ్యర్థులు [email protected] కు ఈ మెయిల్ చేయడం ద్వారా లేదంటే 9393711110, 93910 05006 నెంబర్లకు ఫోన్ చేయడం ద్వారా హాల్ టికెట్లను పొందవచ్చని అధికారులు సూచించారు.






