- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
‘రాజీవ్ యువ వికాసం’ దరఖాస్తుదారులకు అలర్ట్.. మొదటి ప్రాధాన్యత వాళ్లకే!
యువ వికాసం స్కీమ్ లో రూ. 50వేల పెట్టుబడితో ప్రారంభమయ్యే చిన్న తరహా వ్యాపారాలకే మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది.

దిశ, తెలంగాణ బ్యూరో: యువ వికాసం స్కీమ్ లో రూ. 50వేల పెట్టుబడితో ప్రారంభమయ్యే చిన్న తరహా వ్యాపారాలకే మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. అ తరువాత రూ.లక్ష పెట్టుబడికి ప్రయారిటీ ఇవ్వనున్నట్లు తెలిసింది. జూన్ 2 సందర్భంగా పంపిణీ చేసే శాంక్షన్ లెటర్లలో ఎక్కువగా రూ. 50 వేల పెట్టుబడితో మొదలయ్యే వ్యాపారాలు ఉంటాయని తెలుస్తున్నది.
కిరాణా.. పాడి పోషణ
రాజీవ్ యువ వికాసం కింద వచ్చిన దరఖాస్తుల్లో మెజార్టీ కిరాణ దుకాలను ఏర్పాటు చేసేందుకు దరఖాస్తు చేసుకున్నారు. ఆ తరువాత ఆవులు, గేదెల పెంపకం కోసం ఇంట్రెస్ట్ చూపారు. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 16 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. అందులో అర్హులైన సుమారు 8 లక్షల మందిని ఎంపిక చేయనున్నారు. అయితే తక్కువ పెట్టుబడితో స్వయం ఉపాధి పొందేందుకు సిద్ధంగా ఉన్న యువతను ముందుగా ప్రొత్సహించేందుకు ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తున్నది. అందులో భాగంగా కిరాణ షాపుల ఏర్పాటుకు ప్రయారిటీ ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. లబ్ధిదారుడు సొంత గ్రామంలో రెండు, మూడు కిరాణ షాపులు ఉంటే, స్టేషనరీ, బ్యాంగిల్ స్టోర్ లాంటి వ్యాపారాలను ప్రారంభించేందుకు ఎంకరేజ్ చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఆ తరువాత పాడిపరిశ్రమను ప్రొత్సహించేందుకు ఆవులు, గేదెలను కొనుగోలు చేసేందుకు ఆర్థిక సాయం అందించనున్నట్లు సమాచారం.
జూన్ 2న యువ వికాసం మంజూరు పత్రాలు
రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవమైన జూన్ 2 నుంచి తొమ్మిదో తేదీ వరకు రాజీవ్ యువ వికాసం పథకం లబ్ధిదారులకు శాంక్షన్ లెటర్ల పంపిణీ కార్యక్రమాన్ని పకడ్బందీగా నిర్వహించాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు అధికారులను ఆదేశించారు. జూన్ 10 నుంచి 15 వరకు జిల్లా, నియోజకవర్గ స్థాయిలో రాష్ట్రవ్యాప్తంగా ఒకే శిక్షణ కార్యక్రమాలు చేపట్టాలన్నారు. జూన్ 15 తర్వాత గ్రౌండింగ్ కార్యక్రమాన్ని పకడ్బందీగా నిర్వహించాలి అన్నారు. గాంధీ జయంతి అయిన అక్టోబర్ రెండు నాటికి లక్ష్యంగా పెట్టుకున్న ఐదు లక్షల మంది యువతకు స్వయం ఉపాధి కల్పించాలని సూచించారు. మంగళవారం సెక్రెటేరియట్ లో నిర్వహించిన సమావేశంలో యువ వికాసం అమలుపై ఆయన అధికారులకు పలు సూచనలు చేశారు. ప్రతి నెలా ఈ కార్యక్రమం చేపట్టి దశలవారీగా పూర్తి చేయాలని, జిల్లా ఇన్ చార్జి మంత్రులు, కలెక్టర్లతో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ సంక్షేమ శాఖ ఉన్నతాధికారులు సమన్వయం చేసుకోవాలని సూచించారు. గిగ్ వర్కర్లుగా ఉపాధి పొందేందుకు యువత ద్విచక్ర వాహనాలు కొనుగోలు చేసుకునేందుకు అవకాశం ఇవ్వాలని కోరుతున్నారని, యువ వికాసంలో వారికి అవకాశం కల్పించేలా చూడాలని అధికారులను డిప్యూటీ సీఎం ఆదేశించారు.






