- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు అలర్ట్.. అకౌంట్లలో డబ్బులు పడకపోతే చేయాల్సింది ఇదే!
ఇందిరమ్మ ఇండ్ల పథకంలో భాగంగా లబ్ధిదారులకు రూ.1,612.37 కోట్లను విడుదల చేసినట్లు హౌసింగ్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ వీపీ గౌతం ఒక ప్రకటనలో తెలిపారు.

దిశ, తెలంగాణ బ్యూరో: ఇందిరమ్మ ఇండ్ల పథకంలో భాగంగా లబ్ధిదారులకు రూ.1,612.37 కోట్లను విడుదల చేసినట్లు హౌసింగ్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ వీపీ గౌతం ఒక ప్రకటనలో తెలిపారు. అర్హులైన పేదలందరికీ సొంత ఇంటి వసతి కల్పించాలన్న లక్ష్యంతో ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని అమలు చేస్తున్నదని, ఈ పథకంలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా సుమారు 2.12 లక్షల ఇళ్ల పనులు ప్రారంభం అయ్యాయని.. ఇంతవరకు సుమారు 1.50 లక్షల ఇల్లకుపైగా చెల్లింపులు చేసినట్లు పేర్కొన్నారు. ఇంటి నిర్మాణ పనుల దశలను బట్టి లబ్ధిదారులకు విడతల వారీగా మొత్తం రూ.5 లక్షలను వారి ఖాతాల్లో నేరుగా జమ చేస్తున్నామని వెల్లడించారు. లబ్ధిదారుల్లో ఎవరికైనా బిల్లు మొత్తం జమకాని పక్షంలో, వారు తమ అకౌంట్ ఉన్న బ్యాంకుకు వెళ్లి ఆధార్ నెంబర్‌ను ఖాతాకు అనుసంధానించుకోవాలని సూచించారు.
జోరుగా ఇండ్ల నిర్మాణాలు
రాష్ట్రవ్యాప్తంగా 12 వేల పైచిలుకు గ్రామాలు, సుమారు 4 వేల మున్సిపల్ వార్డుల్లో ఇందిరమ్మ ఇండ్ల పనులు జోరుగా సాగుతున్నాయని, అనేక ప్రాంతాల్లో ప్రతినిత్యం ఇందిరమ్మ ఇండ్ల గృహ ప్రవేశ కార్యక్రమాలు జరుగుతున్నాయని ఎండీ తెలిపారు. పూర్తి పారదర్శకతతో.. అధునాతన టెక్నాలజీని వాడుతూ ప్రతి సోమవారం లబ్ధిదారుల ఖాతాలకు నేరుగా డబ్బులు జమ చేస్తున్నామని పేర్కొన్నారు. అందులో భాగంగా ఈ వారంలో రికార్డు స్థాయిలో 17 వేల ఇండ్ల పురోగతికి సంబంధించిన రూ.188.35 కోట్లను విడుదల చేసినట్లు తెలిపారు.
ఇప్పటివరకు విడుదల చేసిన బిల్లుల వివరాలు..
బేస్‌మెంట్ స్థాయి రూ.1,210.76 కోట్లు (1,21,076 ఇండ్లు)
రూఫ్ లెవల్ రూ.252.64 కోట్లు (25,264 ఇండ్లు)
రూఫ్ క్యాస్టెడ్ రూ.155.44 కోట్లు (7,772 ఇండ్లు)






