- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ALERT : అయోధ్యకు వీఐపీ టికెట్ పేరిట లింక్ వచ్చిందా..?
సైబర్ మోసగాళ్లు కొత్త మోసానికి తెరతీశారు.

X
దిశ, వెబ్‌డెస్క్: సైబర్ మోసగాళ్లు కొత్త మోసానికి తెరతీశారు. అయోధ్య రామ మందిరానికి వీఐపీ టికెట్లు గెలుచుకున్నారు అంటూ వాట్సాప్‌కు ఏపీకే ఫైల్ పంపుతున్నారు. దీనిపై ట్విట్టర్ వేదికగా ఆర్టీసీ ఎండీ సజ్జనార్ స్పందించారు. ‘అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవ ఈవెంట్‌కు వీఐపీ టికెట్లు కావాలా? అయితే ఈ లింక్ క్లిక్ చేయండి. డైరెక్ట్‌గా ఈ ఏపీకే ఫైల్‌ను డౌన్ లోడ్ చేసుకోండి. అని మీకు వాట్సాప్‌లో మెసేజ్ వచ్చిందా? అయితే తస్మాత్ జాగ్రత్త! ఇలాంటి మెసేజ్‌లోని లింక్స్ క్లిక్ చేసినా, ఏపీకే ఫైల్స్ డౌన్ లోడ్ చేసినా.. ఇక అంతే! మీ డేటాను సైబర్ నేరగాళ్లు దోచుకుంటారు. మీ వ్యక్తి గత వివరాలు, బ్యాంక్ వివరాలన్నీ తస్కరించి మోసాలకు తెగబడతారు.’ అని ట్వీట్ చేశారు. ఈ మేరకు వాట్సాప్‌లో వచ్చిన ఏపీకే ఫైల్ ఫోటోను ట్వీట్‌కు జత చేశారు.
Next Story






