అలర్ట్ : నేడు 19 ఎంఎంటీఎస్ రైళ్లు రద్దు

by Disha Web Desk 4 |
అలర్ట్ : నేడు 19 ఎంఎంటీఎస్ రైళ్లు రద్దు
X

దిశ, మెట్టుగూడ : ట్రాక్ మరమ్మతుల కారణంగా హైదరాబాద్‌లో ఎంఎంటీఎస్​రైళ్లను తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. 19 సర్వీసులను రద్దు చేస్తున్నట్లు తెలిపింది. లింగంపల్లి-హైదరాబాద్ రూట్‌లో 2 సర్వీసులు రద్దు కాగా హైదరాబాద్-లింగంపల్లి రూట్‌లోనూ 3 సర్వీసులు రద్దైనట్లు తెలిపింది. ఫలక్‌నమా-లింగంపల్లి రూట్‌లో 5 సర్వీసులు రద్దు అయ్యాయి. లింగంపల్లి-ఫలక్​నుమా రూట్‌లో 6 సర్వీసులు రద్దు చేసినట్లు ప్రకటించింది. ఫలక్‌నమా-రామచంద్రపురం, రామచంద్రపురం-ఫలక్‌నమా, ఫలక్‌నమా-హైద్రాబాద్‌లో ఒక్కో సర్వీసు రద్దు చేస్తున్నట్లు సౌత్ సెంట్రల్ రైల్వే పేర్కొంది.

రద్దు చేయబడ్డ MMTS రైళ్లు వివరాలు:

1. 47135 లింగంపల్లి–హైద్రాబాద్,

2. 47137 లింగంపల్లి–హైద్రాబాద్,

3. 47110 హైద్రాబాద్–లింగంపల్లి,

4. 47111 హైద్రాబాద్-లింగంపల్లి,

5. 47119 హైద్రాబాద్–లింగంపల్లి,

6. 47160 ఫలకనుమ–లింగంపల్లి,

7. 47156 ఫలకనుమ–లింగంపల్లి,

8. 47158 ఫలకనుమ–లింగంపల్లి,

9. 47214 ఫలకనుమ–లింగంపల్లి,

10. 47216 ఫలకనుమ–లింగంపల్లి,

11. 47181 లింగంపల్లి–ఫలకనుమ,

12. 47186 లింగంపల్లి–ఫలకనుమ,

13. 47212 లింగంపల్లి–ఫలకనుమ,

14. 47183 లింగంపల్లి–ఫలకనుమ,

15. 47185 లింగంపల్లి–ఫలకనుమ,

16. 47217 లింగంపల్లి–ఫలకనుమ,

17. 47177 ఫలకనుమ-రామచంద్రపురం,

18. 47218 రామచంద్రపురం-ఫలకనుమ,

19. 47201 ఫలకనుమ–హైద్రాబాద్.


Next Story

Most Viewed