- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఆకృతి వ్యవహారం.. తహశీల్దార్, కమిషనర్ లీలలు..!
ప్రభుత్వ భూమిలో ఎలాంటి ఆక్రమణలు జరిగినా వెంటనే చర్యలు తీసుకునే బాధ్యత రెవెన్యూ ఆఫీసర్లపై ఉంటుంది.

దిశ, మేడ్చల్ బ్యూరో: ప్రభుత్వ భూమిలో ఎలాంటి ఆక్రమణలు జరిగినా వెంటనే చర్యలు తీసుకునే బాధ్యత రెవెన్యూ ఆఫీసర్లపై ఉంటుంది. అది చిన్న స్థాయి వ్యక్తులైనా, బడా నేతలైనా, ఏ నిర్మాణ సంస్థ అయిన సరే.. అందరికీ ఒకేలా న్యాయం చేయాల్సి ఉంటుంది. కానీ బాచుపల్లి తహశీల్దార్ పూల్‌సింగ్ మాత్రం ఆకృతి నిర్మాణ సంస్థ కబ్జా చేసిన భూమిపై సదరు నిర్మాణ సంస్థకు అనుకూలంగా రిపోర్టు ఇవ్వడం, ఇంకో అడుగు ముందుకేసి నిజాంపేట మున్సిపల్ కమిషనర్ సైతం ఆ సంస్థకు ఫేవర్‌గా నివేదిక ఇచ్చి ‘ఆకృతి’పై ప్రేమను చూపించారు.
అనుమతులపై ప్రశ్నిస్తే..
బాచుపల్లిలోని సర్వే నంబర్ 453/1, సర్వే నంబర్ 453 బై టులో గల 17 గుంటల భూమిలో అపార్ట్‌మెంట్ నిర్మించేందుకు ఆకృతి నిర్మాణ సంస్థ అనుమతులు తీసుకుంది. నిర్మాణం చేపట్టిన భవనానికి ఇది వరకు రోడ్డుగా ఉన్న ప్రభుత్వ భూమికి, అనుమతులు తీసుకున్న ప్రైవేటు భూమికి మధ్యలో సర్వే నంబర్ 454లో ప్రభుత్వ భూమి ఉంది. పర్మిషన్ తీసుకునే టైంలో ఈ విషయాన్ని దాచిపెట్టి ఎప్పటి నుంచో వాడకంలో ఉన్న ప్రభుత్వ భూమి రోడ్డును అప్రోచ్ రోడ్డుగా చూపించి సదరు నిర్మాణ సంస్థ అనుమతులు పొందింది. ఈ విషయాన్ని గుర్తించిన స్థానికులు ప్రభుత్వ భూమిలో అప్రోచ్ రోడ్డు చూపిస్తూ ఏ విధంగా అనుమతులు పొందుతారు?.. వెంటనే అనుమతులు రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ తహశీల్దార్ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. కంప్లయింట్ అనంతరం నిర్మాణానికి ఎదురుగా ప్రభుత్వ భూమి అంటూ అధికారులు బోర్డు పెట్టారు.
కొనుగోలు చేస్తారంటూ లేఖ
భవనానికి రాకపోకల కోసం అవసరమైన భూమి కొనుగోలు చేసేందుకు సదర నిర్మాణ సంస్థ డైరెక్టర్.. రెవెన్యూ అధికారులకు అర్జీ పెట్టుకున్నాడు. దీనిని పరిగణలోకి తీసుకొని బాచుపల్లి తహశీల్దార్ పూల్ సింగ్ సదరు నిర్మాణ సంస్థ అప్రోచ్ రోడ్డు కోసం అవసరమైన 64 స్క్వేర్ యాడ్స్ భూమిని మార్కెట్ రేటుకు కొనుగోలు చేసేందుకు సిద్ధంగా ఉన్నదని, పహాని, లొకేషన్ మ్యాప్ పేర్కొంటూ ఆర్డీవోకు జనవరి 2025న లెటర్ రాశారు. అయితే అప్రోచ్ లేకుండా అనుమతులు పొందిన ఆకృతి సంస్థ పర్మిషన్‌ను రీవోక్ చేయాలని సిఫారసు చేయాల్సిన తహశీల్దార్ ఆ గవర్నమెంట్ ల్యాండ్‌ను నిర్మాణ సంస్థకు కట్టబెట్టేందుకు అనుకూలంగా ఏ విధంగా రిపోర్టు రాస్తారని స్థానికులు ప్రశ్నిస్తున్నారు.
అనుకూలంగా నిజాంపేట్ కమిషనర్ నివేదిక
ప్రభుత్వ భూమి కబ్జా అంశంపై కోర్టు ఆదేశాల మేరకు నిజాంపేట్ కమిషనర్ ఏప్రిల్‌లో నివేదిక తయారు చేశారు. ఇందులోనూ కేవలం 64 గజాల ప్రభుత్వ భూమి ప్రయివేటు పట్టా భూమికి – వాడకంలో ఉన్న రోడ్డుకు మధ్యలో ఉన్నదని పేర్కొంటూనే, కొన్నేండ్లుగా ప్రస్తుత రోడ్డును స్థానికంగా ఉన్న వారు వినియోగించుకుంటున్నారని, దీనిని పరిగణలోకి తీసుకొని ఆకృతి నిర్మాణ సంస్థ అప్రోచ్ రోడ్డు లేకుండా చేపట్టిన నిర్మాణానికి సైతం అదే రోడ్డును అప్రోచ్ రోడ్డుగా పరిగణించి ఎన్‌వోసీ జారీ అయ్యిందని వివరణ ఇచ్చారు. మొత్తానికి ఇరు శాఖల ప్రభుత్వ ఉన్నతాధికారులు ప్రభుత్వ భూమిని అక్రమంగా అప్రోచ్ రోడ్డుగా చూపిస్తూ ఆకృతి నిర్మాణ సంస్థకు అనుకూలంగా వ్యవహరించారని స్పష్టమవుతుందని స్థానికులు చెబుతున్నారు.






