- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అసెంబ్లీలో కేసీఆర్‌పై అక్బరుద్దీన్ కీలక వ్యాఖ్యలు
అసెంబ్లీలో ఎమ్ఐఎమ్ ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ కీలక వ్యాఖ్యలు చేశారు.

దిశ, వెబ్‌డెస్క్: అసెంబ్లీ(Telangana Assembly)లో ఎమ్ఐఎమ్ ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ(Akbaruddin Owaisi) కీలక వ్యాఖ్యలు చేశారు. శనివారం ఆయన మాట్లాడారు. సభకు రాని వ్యక్తి(కేసీఆర్‌ను ఉద్దేశించి) అజెండా డిసైడ్ చేస్తున్నారు. ఇంతకుముందు సభకు వచ్చి ఇరిగేషన్‌పై చర్చిస్తా అని మాట్లాడారు. తీరా చూస్తే ఆ పార్టీ ఎమ్మెల్యేలు కూడా సభలో లేకుండా వెళ్లిపోయారని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను ఉద్దేశించి అక్బరుద్దీన్ మాట్లాడారు. ఇదిలా ఉంటే.. అసెంబ్లీ నుంచి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు శుక్రవారం వాకౌట్ చేశారు. సీఎం మాట్లాడిన తర్వాత సభలో మాట్లాడేందుకు, నిరసన తెలిపేందుకు అవకాశం ఇవ్వడం లేదని ఆ పార్టీ ఎమ్మెల్యేలు ఆరోపించారు. సభలో ప్రభుత్వం పెట్టే బిల్లులపై చర్చకు దూరంగా ఉండాలని నిర్ణయించారు. ఎమ్మెల్యేల ప్రవేశద్వారం వద్ద వారు ఆందోళనకు దిగారు. స్పీకర్ ప్రసాద్‌కుమార్ పక్షపాతంతో వ్యవహరిస్తున్నారంటూ నినాదాలు చేశారు. అనంతరం గన్‌పార్క్ వద్దకు వెళ్లి అక్కడ బైఠాయించి నిరసన తెలిపారు. శనివారం సభకు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు హాజరు కాకపోవడం గమనార్హం.






