- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కేసీఆర్ ఇదే నేర్పించారా?.. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై ఓవైసీ ఫైర్
పదేళ్ల బీఆర్ఎస్ పాలన కచరా గవర్నెన్స్ అని ఎంఐఎం శాసనసభా పక్ష నేత అక్బరుద్దీన్ ఓవైసీ మండిపడ్డారు.

దిశ, తెలంగాణ బ్యూరో: పదేళ్ల బీఆర్ఎస్ పాలన కచరా గవర్నెన్స్ అని ఎంఐఎం శాసనసభా పక్ష నేత అక్బరుద్దీన్ ఓవైసీ మండిపడ్డారు. పదేళ్లు ఎంజయ్ చేశారని... రాష్ట్రాన్ని లూటీ చేశారని.. ఏడు తరాలకు సరిపడా సంపాదించుకున్నారని ధ్వజమెత్తారు. అసెంబ్లీలో శుక్రవారం భూభారతి బిల్లుపై చర్చ సందర్భంగా బీఆర్ఎస్ నేతలు ఆందోళన చేశారు. ఫార్మూలా ఈరేసుపై చర్చకు పట్టుబట్టడంతో అక్బరుద్దీన్ ఘాటుగా స్పందించారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేల తీరును తప్పుబట్టారు. ఈ రోజు సభలో జరిగింది పదేళ్ల బీఆర్ఎస్ పాలనను తెలిజేస్తుందన్నారు. సభ్యులు ప్రజా సమస్యలను ప్రస్తావించేందుకు సభకు వస్తారని, ఇలా ఆందోళన చేసేందుకు కాదన్నారు. బీఆర్ఎస్ సంస్కృతికి నిదర్శనం ఈ రోజులు సభలో చేసిన నిరసన అన్నారు. ఆపార్టీ సభ్యులకు కేసీఆర్ బోధించింది ఇదేనా? అని ప్రశ్నించారు.
ఇది విచారణ దినం అన్నారు. ప్రజలకు ఏం మెసేజ్ సభ నుంచి ఇస్తున్నామని ప్రశ్నించారు. ధరణి ఒక కుటుంబం కోసం.. ఒక పార్టీ కోసమే తెచ్చారని ఆరోపించారు. ధరణి ఫెయిల్ అయిందన్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అసెంబ్లీలో ప్రజల కోసమా? కుటుంబం కోసం పోరాటం చేస్తున్నారా? అని నిలదీశారు. మేము ప్రజల కోసం పోరాటం చేస్తున్నామన్నారు. మీ కుటుంబం కోసం అసెంబ్లీలో పోరాటం ఏమిటి? అని నిలదీశారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ప్రజల కోసం వచ్చారా...? లేక కేసీఆర్ కుటుంబం కోసం వచ్చారా? అని ప్రశ్నించారు. సభ సజావుగా సాగేందుకు అవసమైతే సభ నుంచి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను సస్పెండ్ చేయాలని స్పీకర్ ను కోరారు. అసెంబ్లీలో సభ్యులు అనుసరించే వ్యూహం ఇదేనా...? బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు చెప్పాలని డిమాండ్ చేశారు.
ముమ్మాటికీ ధరణిలో అక్రమాలు జరిగాయన్నారు. ధరణితో కోట్ల రూపాయలు కొల్లగొట్టారన్నారు. దేవాదాయశాఖ, ప్రభుత్వ, వక్ఫ్ భూములు వేలాది ఎకరాలు కబ్జాకు గురయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వమైనా భూముల ఆడిటింగ్ చేయాలని, సర్వే చేపట్టాలని, న్యూ బౌండరీలు ఏర్పాటు చేయాలని కోరారు. పదేళ్లుగా భూముల ఆడిటింగ్ చేయాలని పదేళ్లుగా డిమాండ్ చేస్తున్నా నా డిమాండ్ ను బీఆర్ఎస్ ప్రభుత్వం పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. వక్ఫ్ భూములు సుమారు 75శాతం కబ్జాకు గురయ్యాని ఆవేదన వ్యక్తం చేశారు. భూములపై టాస్క్ ఫోర్స్ కమిటీ వేసి భూములను కాపాడాలన్నారు. ఇతర రాష్ట్రాల్లో ల్యాండ్స్ రికార్డు సిస్టం ఏ విధంగా ఉందో అధ్యాయనం కూడా చేసి భూభారతి చట్టంలో మార్పులు చేర్పులు చేయాలని కోరారు. మ్యాన్ హోల్ పహానీ ఉండేలా చర్యలు తీసుకోవాలని కోరారు. సాదాబైనామాలు క్లీయర్ చేయాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ నేతలు అసెంబ్లీ నుంచి వెళ్లపోవడంలో మేము సక్సెస్ అయ్యామన్నారు. కేటీఆర్, హరీష్ రావు తీరిదని మండిపడ్డారు.






