హైదరాబాద్‌లో అజయ్ దేవ్‌గన్ ఫిల్మ్ సిటీ

by Gantepaka Srikanth |

హైదరాబాద్‌లో అజయ్ దేవ్‌గన్ ఫిల్మ్ సిటీ

హైదరాబాద్‌లో అజయ్ దేవ్‌గన్ ఫిల్మ్ సిటీ
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ రైజింగ్ విజన్‌లో భాగంగా 2047 నాటికి రాష్ట్రాన్ని 3 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా మార్చే లక్ష్యంతో ప్రభుత్వం వినోదం, పర్యాటకం రంగాల్లో పెట్టుబడులను ఆకర్షిస్తోంది. ఈ నేపధ్యంలో డిసెంబర్ 8–9 తేదీల్లో భారత్ ఫ్యూచర్ సిటీలో జరగబోయే తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్‌కు దేశ–విదేశాల నుండి భారీ స్పందన లభిస్తోంది. ఈ నేపథ్యంలోనే బాలీవుడ్ నటుడు అజయ్ దేవగన్ హైదరాబాద్‌లో ప్రపంచస్థాయి ఫిల్మ్ సిటీ ఏర్పాటు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వంతో ఎంఓయూ కుదుర్చుకోనున్నారు. మరోవైపు రిలయన్స్ గ్రూప్‌ తెలంగాణలో పెట్టుబడులకు ఆసక్తి చూపుతోంది. రిలయన్స్‌కు చెందిన వెంటారా యానిమల్ రెస్క్యూ అండ్ రిహాబిలిటేషన్ సెంటర్, వైల్డ్ లైఫ్ కన్జర్వేటరీ.. నైట్ సఫారి ఏర్పాటు చేయడానికి ముందుకు వచ్చింది. ఈ ప్రాజెక్టుతో రాష్ట్ర పర్యాటక రంగం రూపురేఖలు మారనున్నాయి. ఫుడ్‌లింక్ ఎఫ్ అండ్ బీ హోల్డింగ్స్ కంపెనీ రూ.3వేల కోట్లతో ఫ్యూచర్ సిటీలో మూడు హోటళ్లు నిర్మించేందుకు ఒప్పందం చేసుకోనున్నారు. ఈ కీలక ఒప్పందాలపై ఈ గ్లోబల్ సదస్సులో సంతకాలు కానున్నాయి.

Next Story