- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
AIYF: మెడికల్ మాఫియా దందాను అరికట్టాలి.. ఏఐవైఎఫ్ ఆందోళన
రాష్ట్రవ్యాప్తంగా ప్రైవేటు, కార్పొరేట్ మెడికల్ మాఫియా దందాను అరికట్టాలని, ప్రభుత్వ ఆసుపత్రుల్లో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని ఏఐవైఎఫ్ డిమాండ్ చేసింది.

దిశ, డైనమిక్ బ్యూరో: రాష్ట్రవ్యాప్తంగా ప్రైవేటు, కార్పొరేట్ మెడికల్ మాఫియా దందాను అరికట్టాలని, ప్రభుత్వ ఆసుపత్రుల్లో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని ఏఐవైఎఫ్ (AIYF) డిమాండ్ చేసింది. ఈ నేపథ్యంలోనే కోఠిలోని డైరెక్టరేట్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ కార్యాలయ (Director Of Health, Telangana) ముట్టడి కార్యక్రమం నిర్వహించారు. ధర్నా నిర్వహించి, కార్యాలయంలోకి చొచ్చుకెళ్తున్న క్రమంలో పోలీసుల అడ్డుకుని అరెస్ట్ చేసి సుల్తాన్ బజార్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఈ సందర్భంగా ఏఐవైఎఫ్ రాష్ట్ర కార్యదర్శి కె. ధర్మేంద్ర, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ నెర్లకంటి శ్రీకాంత్‌లు మాట్లాడుతూ ప్రజల ప్రాణాలతో వ్యాపారం చేస్తున్న ఆస్పత్రులపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రభుత్వం ప్రజల ఆరోగ్యం పట్ల నిర్లక్ష్య ధోరణి కనబరుస్తోందని ఆరోపించారు. రాష్ట్రంలో ప్రైవేటు, కార్పొరేట్ ఆగడాలను అరికట్టడంలో పూర్తిగా విఫలం చెందారని మండిపడ్డారు. ఇదే అదునుగా ప్రైవేట్ ఆసుపత్రులు తమ వికృత వ్యాపార మెడికల్ దందాకు తెరలేపిందని ఆరోపించారు.
ఇటీవల కాలంలో కిడ్నీ అక్రమ మార్పిడిలు, చర్మ సంబంధిత సర్జరీలు, బ్లడ్ అక్రమ దందాలు, నకిలీ డాక్టర్ల సేవలు, ప్రైవేట్ డయాగ్నోస్టిక్ సెంటర్ల విచ్చలవిడి దోపిడీలు తారాస్థాయికి చేరాయని వారు ఆరోపించారు. రాష్ట్రంలో వైద్య ఆరోగ్య శాఖ అధికారులు కాసుల కక్కుర్తికి అలవాటు పడి మామూళ్ల మత్తులో మునిగి తేలుతున్నారని, ఈ మేరకు వైద్య ఆరోగ్య శాఖను ప్రక్షాళన చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక విభాగం ఏర్పాటు ద్వారా రాష్ట్ర మంతటా ప్రైవేట్, కార్పొరేట్ ఆసుపత్రిలపై దాడులు చేపట్టాలని, అనుమతులు లేకుండా నడుస్తున్న వాటిపై క్రిమినల్ చర్యలు చేపట్టాలని వారు డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున పోరాటాలకు పిలుపుఇస్తామని వారు హెచ్చరించారు.






