- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Airtel: మరోసారి ఎయిర్టెల్ నెట్వర్క్ డౌన్.. హైదరాబాద్ లోనూ ఫిర్యాదుల వెల్లువ
ఎయిర్ టెల్ సేవలు నిలిచిపోయాయని నెటిజన్లు ఫిర్యాదులు చేస్తున్నారు.

దిశ, డైనమిక్ బ్యూరో: భారత దేశంలో రెండో అతిపెద్ద టెలికాం సర్వీస్ ప్రొవైడర్ అయిన ఎయిర్ టెల్ నెట్ వర్క్ మరోసారి డౌన్ అయింది. ఎయిర్ టెల్ సేవలకు అంతరాయం కలిగిందని ఆదివారం భారీ సంఖ్యలో వినియోగదారులు సోషల్ మీడియాలో ఫిర్యాదులు చేస్తున్నారు. ఢిల్లీ, బెంగళూరు, హైదరాబాద్ సహా దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో ఇవాళ ఉదయం నుంచే నెట్ వర్క్ సమస్యలు ఎదుర్కొంటున్నామని నెటిజన్లు పోస్టులు చేస్తున్నారు. చాలామంది కాల్స్ చేయలేకపోతున్నామని మొబైల్ డేటా, వైఫై సేవలు వినియోగించుకోలేపోతున్నామని ఎక్స్ వేదికగా అసహనం వ్యక్తం చేస్తూ పోస్టులు చేస్తున్నారు.
దేశవ్యాప్తంగా ఇవాళ ఉదయం 10 గంటల తర్వాత ఈ ఇబ్బందులు మొదలైనట్లు తెలుస్తోంది. అయితే మధ్యాహ్నం 12:27 గంటల వరకు డౌన్ డిటెక్టర్ వెబ్ సైట్ లో 6,905 మంది ఫిర్యాదు చేశారు. 52 శాతం మంది సిగ్నల్ రావడం లేదని ఫిర్యాదు చేయగా, 31 శాతం మంది మొబైల్ ఇంటర్నెట్ ఉపయోగించుకోలేకపోతున్నామని మరో 17 శాతం మంది టోటల్ బ్లాక్ ఔవుట్ అయిందని ఫిర్యాదు చేశారు. ఇక గత వారం కూడా ఎయిర్ టెల్ నెట్ వర్క్ దేశంలోని పలు ప్రాంతాల్లో డౌన్ అయింది. తరచుగా నెట్ వర్క్ ఇష్యూస్ రావడం వల్ల ఇబ్బందులకు గురవుతున్నామని నెటిజన్లు కస్టమర్లు మండిపడుతున్నారు.






