రైల్వే స్టేషన్‌లో ఎయిర్‌పోర్ట్ తరహా రూల్స్.. స్కాన్ చేస్తేనే ఎంట్రీ..!

by Gantepaka Srikanth |

అమృత్‌భారత్ ప్రాజెక్ట్‌లో భాగంగా కొత్త రూపులుదిద్దుకుంటున్న సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ వచ్చే నెలలో అందుబాటులోకి రానుంది.

రైల్వే స్టేషన్‌లో ఎయిర్‌పోర్ట్ తరహా రూల్స్.. స్కాన్ చేస్తేనే ఎంట్రీ..!
X

దిశ, వెబ్‌డెస్క్: అమృత్‌భారత్ ప్రాజెక్ట్‌లో భాగంగా కొత్త రూపులుదిద్దుకుంటున్న సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ వచ్చే నెలలో అందుబాటులోకి రానుంది. ఇప్పటి స్టేషన్‌ పునరాభివృద్ధి పనులు చివరి దశకు చేరుకున్నాయి. దాదాపు 90 శాతం పనులు మొత్తం పూర్తయ్యాయి. ఎయిర్‌ కాంకోర్స్‌, ఇతర కొన్ని కీలకమైన పనులు మాత్రమే మిగిలి ఉన్నాయి. ఇవి కూడా త్వరలోనే పూర్తి చేసి స్టేషన్‌ పూర్తి స్థాయిలో ప్రయాణికులకు అందుబాటులోకి తీసుకొస్తామని అధికారులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో రైల్వే అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రయాణికులకు కొత్త అనుభూతితో పాటు కొత్త రూల్స్‌ను కూడా పరిచయం చేయడానికి సిద్ధమయ్యారు. మెట్రో స్టేషన్, రైల్వేస్టేషన్ తరహాలో ఎంట్రీ విధానాన్ని అమల్లోకి తీసుకురానున్నట్టు తెలుస్తోంది. ఈ విధానంతో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో ఎంటర్ అవ్వాలంటే టికెట్ స్కాన్ చేయాల్సిందే. ట్రైన్ టికెట్‌లపై ఉన్న QR కోడ్‌లను స్కాన్ చేసిన తర్వాతే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లోకి ప్రయాణికులను అనుమతించనున్నారు. ప్రయాణికుల భద్రతా చర్యల్లో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. అయితే ఎయిర్ పోర్టు తరహాలో సామాను స్కానింగ్, భద్రతా తనిఖీలను ప్రవేశపెట్టాలని దక్షిణ మధ్య రైల్వే అధికారులు యోచిస్తున్నారు. సికింద్రాబాద్ స్టేషన్ రీడెవలప్మెంట్ అనంతరం భద్రతా చర్యలు పటిష్టం చేయనున్నట్లు తెలుస్తోంది.

Next Story