- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
హైదరాబాద్‌లో 'ప్రమాదకర' స్థాయికి చేరిన వాయు నాణ్యత
దేశ రాజధాని ఢిల్లీ సహా ఇతర నగరాలకు ముప్పుగా మారిన వాయి కాలుష్యం తాజాగా హైదరాబాద్‌కు చేరింది.

దిశ, వెబ్ డెస్క్: దేశ రాజధాని ఢిల్లీ సహా ఇతర నగరాలకు ముప్పుగా మారిన వాయి కాలుష్యం తాజాగా హైదరాబాద్‌కు చేరింది. వాయు నాణ్యత సూచీ (AQI) నాటికి 255కు చేరుకుని 'ప్రమాదకర' స్థాయికి చేరింది. ముఖ్యంగా బాలానగర్, సనత్‌నగర్, జీడిమెట్ల, మల్లాపూర్ వంటి పారిశ్రామిక, రద్దీ ప్రాంతాల్లో కాలుష్యం తీవ్రంగా ఉంది. శీతాకాలపు పొగమంచుకు తోడు వాహనాల ఉద్గారాలు, చెత్త దహనం వల్ల గాలిలో సూక్ష్మ ధూళి కణాలు భారీగా పెరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో సైనసైటిస్, డస్ట్ అలర్జీ, శ్వాసకోశ సమస్యలు ఉన్న వారు బయటకు వెళ్లేటప్పుడు తప్పనిసరిగా మాస్కులు ధరించాలని, ముఖ్యంగా ఉదయం వేళల్లో వ్యాయామాలకు దూరంగా ఉండాలని వైద్యులు హెచ్చరిస్తున్నారు.
మరోవైపు, దేశ రాజధాని ఢిల్లీలో పరిస్థితి మరింత భయంకరంగా మారింది. అక్కడ AQI స్థాయిలు 400 నుంచి 500 మధ్య నమోదవుతూ 'అత్యంత ప్రమాదకర' (Severe) కేటగిరీలో కొనసాగుతున్నాయి. దట్టమైన పొగమంచు కారణంగా విజిబిలిటీ తగ్గి వందలాది విమానాలు, రైళ్ల రాకపోకలకు అంతరాయం కలుగుతోంది. ఢిల్లీ ప్రభుత్వం ఇప్పటికే గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్ (GRAP-4) కింద కఠిన ఆంక్షలు విధించి, పాఠశాలలకు సెలవులు ప్రకటించింది. కేవలం ఢిల్లీలోనే కాకుండా ముంబై, కోల్‌కతా వంటి నగరాల్లో కూడా వాయు నాణ్యత వేగంగా క్షీణిస్తుండటంతో, ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.






