Air India crash: ఘటన స్థలంలో బ్లాక్ బాక్స్ లభ్యం.. కీలక విషయాలు వెలుగులోకి!

by Prasad Jukanti |   (  Updated:2025-06-13 11:07:55  IST  )

ఫ్లైట్ క్రాష్ ఘటన విచారణలో అధికారులు కీలక పురోగతి సాధించారు.

Air India crash: ఘటన స్థలంలో బ్లాక్ బాక్స్ లభ్యం.. కీలక విషయాలు వెలుగులోకి!
X

దిశ, డైనమిక్ బ్యూరో : అహ్మదాబాద్ ఎయిర్ ఇండియా (Air India crash) విమాన ప్రమాదం ఘటన విచారణలో అధికారులు కీలక పురోగతి సాధించారు. ప్రమాదానికి గల కారణాలను తేల్చేందుకు కీలకంగా భావిస్తున్న బ్లాక్ బాక్స్ (black box) లభించింది. ఇది విమానం వెనుక భాగంలో ఉండగా బిల్డింగ్ శిథిలాల్లో కూరుకుపోయింది. గుర్తించిన అధికారులు వెలికితీసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. బ్లాక్ బాక్స్‌ను డీకోడ్ చేసి అందులోని సమాచారాన్ని విశ్లేషిస్తే ప్రమాదానికి సంబంధించి కీలక విషయాలు తెలిసే అవకాశం ఉంది. టేకాఫ్ నుంచి ల్యాండింగ్ వరకు ఇందులో పూర్తి డేటా నిక్షిప్తం అవుతుంది. విమానానికి ఎలాంటి విపత్తు జరిగినా బ్లాక్ బాక్స్ సురక్షితంగా ఉండేలా తయారు చేస్తారు.

డీవీఆర్ స్వాధీనం..

క్రాష్ అయిన బోయింగ్‌ 787-8 డ్రీమ్‌ లైనర్‌ ఫ్లైట్ శకలాల నుంచి డిజిటల్ వీడియో రికార్డర్‌(డీవీఆర్)ను ఇప్పటికే గుజరాత్ ఏటీఎస్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. దీంతో విమానం ప్రమాదానికి గురయ్యే ముందు ఫ్లైట్ లోపల రికార్డ్ అయిన పూర్తి ఫుటేజీ లభించే అవకాశం ఉంది. డీవీఆర్ స్వాధీనం చేసుకున్న కాసేపటికే బ్లాక్ బాక్స్‌ను సైతం గుర్తించారు.

Next Story