- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
AICC: రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలకు పిలుపునిచ్చిన ఏఐసీసీ.. ప్రధాన కారణం ఇదే!
ఎన్నికల ముందు చెప్పినట్లుగానే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) భారత్‌కు ఊహించని షాక్ ఇచ్చాడు.

దిశ, వెబ్‌డెస్క్: ఎన్నికల ముందు చెప్పినట్లుగానే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) భారత్‌కు ఊహించని షాక్ ఇచ్చాడు. ఇచ్చిన మాట మేరకు దేశంలో చొరబడిన అక్రమ వలసదారులపై ఉక్కుపాదం మోపాడు. ఇప్పటికే 18 వేల మంది భారతీయులు అమెరికా (America)లో అక్రమంగా నివసిస్తున్నట్లుగా నిర్ధారించారు. ఈ పరిణామంతో దొరికిన వారిని దొరికినట్లుగా అగ్రదేశానికి అక్రమంగా వలస వెళ్లిన భారతీయులను విమానంలో స్వదేశానికి తరలిస్తున్నారు. ఈ నెల 5న టెక్సాస్ (Texas) నగరం నుంచి 105 మంది అక్రమ వలసదారులతో సీ-17 యూఎస్ మిలిటరీ ఎయిర్‌క్రాఫ్ట్ (C-17 US military aircraft) బుధవారం భారత్‌లోని అమృత్‌సర్ ఎయిర్‌పోర్టులో ల్యాండ్ అయింది.
ఈ క్రమంలోనే అమెరికా (America)లో భారతీయులను స్వదేశానికి పంపించే విషయంలో అక్కడి ప్రభుత్వం అమానవీయంగా ప్రవర్తిస్తుందని ఏఐసీసీ (AICC) ఆరోపించింది. నేరం చేసినట్లుగా అక్కడి పోలీసు అధికారులు భారతీయులకు ఏకంగా కాళ్లకు బేడీలు వేయడం బాధకరమని అన్నారు. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం (Central Government) నిస్సహాత వ్యక్తం చేయడం వారిని కాపాడేందుకు ఎలాంటి చర్యలు చేపట్టకపోవడాన్ని నిరసిస్తూ నేడు తెలంగాణ (Telangana) రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో నిరసన కార్యక్రమాలు చేపట్టాలని ఏఐసీసీ పిలుపునిచ్చింది. అదేవిధంగా అమెరికా (America)లో ఉన్న భారతీయులను భద్రతతో ఇండియాకు పంపించేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ నిరసన కార్యక్రమాలను విజయవంతంగా చేపట్టాలని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ (TPCC Chief Mahesh Kumar Goud) కాంగ్రెస్ శ్రేణులకు పిలునిచ్చారు.






