PCC క్రమశిక్షణ కమిటీ చైర్మన్‌గా కీలక ఎంపీ.. టీ.కాంగ్రెస్ కమిటీలకు AICC ఆమోదం

by Gantepaka Srikanth |   (  Updated:2025-05-29 16:35:08  IST  )

తెలంగాణ కాంగ్రెస్‌(Telangana Congress) కమిటీలకు ఏఐసీసీ(AICC) గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

PCC క్రమశిక్షణ కమిటీ చైర్మన్‌గా కీలక ఎంపీ.. టీ.కాంగ్రెస్ కమిటీలకు AICC ఆమోదం
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ కాంగ్రెస్‌(Telangana Congress) కమిటీలకు ఏఐసీసీ(AICC) గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. పొలిటికల్ ఎఫైర్స్, అడ్వైజరీ, డీలిమిటేషన్, రాజ్యాంగ పరిరక్షణ, క్రమశిక్షణ కమిటీల ఏర్పాటును ఆమోదించింది. మొత్తం 22 మందితో కమిటీలు ఏర్పాటు చేశారు. పీఏసీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy), డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబుకు అవకాశం కల్పించారు. మరో 15 మందితో అడ్వైజరీ కమిటీ నియమించారు. ఇందులో రేవంత్ రెడ్డి, మధుయాష్కి, గీతారెడ్డి, జగ్గారెడ్డిలకు చోటు కల్పించారు. మరో ఏడుగురితో డీలిమిటేషన్ కమిటీ ఏర్పాటు చేశారు. ఈ కమిటీకి చైర్మన్‌గా వంశీచంద్ రెడ్డిని నియమించారు. పీసీసీ క్రమశిక్షణ కమిటీ చైర్మన్‌గా నాగర్ కర్నూలు ఎంపీ మల్లు రవికి అవకాశం కల్పించారు. మరో 16 మందితో సంవిధాన్ బచావో ప్రోగ్రామ్ కమిటీ ఏర్పాటు చేశారు. దీనికి చైర్మన్‌గా పి. వినయ్ కుమార్‌కు ఛాన్స్ ఇచ్చారు. సభ్యులుగా అద్దంకి దయాకర్, బాలూ నాయక్, నర్సారెడ్డిలు ఉన్నారు.













Next Story