Breaking News : పలు రాష్ట్రాలకు జనరల్ సెక్రటరీలను, ఇంచార్జీలను ప్రకటించిన కాంగ్రెస్ అధిష్టానం

by Muthe.Rajitha |

కాంగ్రెస్ అధిష్టానం(AICC) మరో కీలక నిర్ణయం తీసుకుంది.

Breaking News : పలు రాష్ట్రాలకు జనరల్ సెక్రటరీలను, ఇంచార్జీలను ప్రకటించిన కాంగ్రెస్ అధిష్టానం
X

దిశ, వెబ్ డెస్క్ : కాంగ్రెస్ అధిష్టానం(AICC) మరో కీలక నిర్ణయం తీసుకుంది. రెండు రాష్ట్రాలకు జనరల్ సెక్రెటరీల(General Secretaries)ను, తొమ్మిది రాష్ట్రాలకు ఇన్ఛార్జీల(In-charges)ను ప్రకటించింది. పంజాబ్ కు భూపేష్ భాగల్(Bhupesh Bhagal), జమ్ము కాశ్మీర్ కు డా. సయ్యద్ నజీర్ హుస్సేన్ లను ప్రధాన కార్యదర్శులుగా నియమించింది. తెలంగాణ ఏఐసీసీ ఇన్ఛార్జిగా మీనాక్షీ నటరాజన్(Meenakshi Natarajan) ను నియమించింది. అదే విధంగా.. హిమాచల్ ప్రదేశ్ మరియు చండీఘర్ కు రజనీ పాటిల్, హర్యాణకు బీకే హరిప్రసాద్, మధ్యప్రదేశ్ కు హరీష్ చౌదరి, తమిళనాడు మరియు పాండిచ్చేరికి గిరీష్ చోడంకర్, ఒడిషాకు అజయ్ కుమార్ లల్లూ, జార్ఖండ్ కు కే రాజు, బీహార్ కు కిషన అల్లవారును నియమించింది. ఇక ఈశాన్య రాష్ట్రాలైన మణిపూర్, త్రిపుర, సిక్కిం, నాగాలాండ్ రాష్ట్రాలకు కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జ్ గా సప్తగిరి శంకర్ ఉలకలను నియమించింది. ఈ మేరకు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కే సీ వేణుగోపాల్(KC Venugopal) ఉత్తర్వులు జారీ చేశారు. అయితే మిగతా రాష్ట్రాలకు ప్రస్తుతం ఉన్న జనరల్ సెక్రటరీస్, ఇన్ఛార్జీలు యథావిధిగా కొనసాగుతారని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.





Next Story