- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
AI పులి సంచారం ప్రచారానికి తెర.. నిందితుడి అరెస్ట్
టెక్నాలజీని ఆయుధంగా మార్చుకొని ప్రజలను భయాందోళనలకు గురిచేసే ప్రయత్నాలకు అధికారులు చెక్ పెట్టారు.

దిశ, డైనమిక్ బ్యూరో: టెక్నాలజీని ఆయుధంగా మార్చుకొని ప్రజలను భయాందోళనలకు గురిచేసే ప్రయత్నాలకు అధికారులు చెక్ పెట్టారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) సహాయంతో పులి సంచారం అంటూ అసత్య ప్రచారం చేసిన వ్యక్తిని అటవీ శాఖ అధికారులు తాజాగా అరెస్ట్ చేశారు. మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని సీసీసీ టౌన్‌షిప్‌లో బుధవారం రాత్రి AI ద్వారా తయారు చేసిన మార్ఫింగ్ ఫోటోలను సోషల్ మీడియాలో వైరల్ చేస్తూ ‘పులి సంచారం’ జరుగుతోందని తప్పుడు ప్రచారం జరిగింది. టౌన్‌షిప్‌లో టైగర్ ఉందని, కారులో ఉండి ఒక అతను ఫోటో తీశాడని ఫోటో వైరల్ అయింది. ఈ వార్తతో కాలనీవాసులు భయాందోళనకు గురయ్యారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.
సమాచారం అందుకున్న అటవీ శాఖ అధికారులు వెంటనే రంగంలోకి దిగారు. విచారణలో పులి సంచారం అన్నది పూర్తిగా అసత్యమని, AI సాంకేతికతతో ఫోటోను సృష్టించి సోషల్ మీడియాలో ప్రచారం చేసినట్లు నిర్ధారించారు. ఈ ఘటనకు బాధ్యుడైన వ్యక్తిని అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అటవీ శాఖ అధికారులు మాట్లాడుతూ.. ప్రజలు ఎవరూ ధృవీకరణ లేని సమాచారాన్ని నమ్మవద్దని, అనుమానాస్పద ఫోటోలు, వీడియోలు చూసిన వెంటనే అధికారులకు సమాచారం ఇవ్వాలని సూచించారు.






