- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
AI in Agriculture: వ్యవసాయ రంగంలో ఏఐ.. మంత్రి తుమ్మలతో నెదర్లాండ్ కంపెనీ ప్రతినిధులు భేటీ
వ్యవసాయ రంగంలో తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం విప్లవాత్మక మార్పులు తీసుకు రాబోతుంది.

దిశ, డైనమిక్ బ్యూరో: (Agricultural sector)వ్యవసాయ రంగంలో తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం విప్లవాత్మక మార్పులు తీసుకు రాబోతుంది. ఈ రంగంలో టెక్నాలజీ వాడకంపై సర్కార్ ఫోకస్ పెట్టింది. వ్యవసాయ రంగంలో ఏఐ "ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్" (AI in Agriculture) వినియోగంపై తెలంగాణ ప్రభుత్వం దృష్టి పెట్టింది. ఈ మేరకు ఇవాళ (గురువారం) నెదర్లాండ్ కంపెనీ (Netherlands company) ఏఆర్ఐక్యూటీ (ARIQT) ప్రతినిధులు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు (Thummala Nageswara Rao)తో సమావేశం నిర్వహించారు. తమ సంస్థ ద్వారా రైతులకు ఒకేసారి సమాచారాన్ని అందించడం, రైతుల ఫిర్యాదులకు ఏఐ (AI) ఆధారంగా తక్షణ సూచనలు ఇవ్వడం వంటి సౌకర్యాలు కల్పిస్తామని సంస్థ ప్రతినిధులు పేర్కొన్నారు.
పంటలపై వచ్చే చీడపీడలను మొబైల్ కెమెరా ద్వారా స్కాన్ చేసి గుర్తించే టెక్నాలజీని తీసుకొస్తామని నెదర్లాండ్ కంపెనీ ప్రతినిధులు మంత్రికి వివరించారు. ఇందుకు మంత్రి సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తోంది. కాగా, లేటెస్ట్ టెక్నాలజీ అయిన ఏఐ ఇతర రంగాల మాదిరిగానే వ్యవసాయరంగంలో కూడా మెరుగైన ఫలితాలను అందిస్తుందన్న అంచనాలున్నాయి. ఏఐ (కృత్రిమ మేధస్సు) వాడకం వ్యవసాయ రంగంలో సమస్యలకు పలు రకాల మార్గాలను సూచిస్తోందని, పంట దిగుబడులు పెంచుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.






