- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Agros: ఆగ్రోస్ మళ్లీ రంగంలోకి.. క్షేత్ర స్థాయి పర్యటనలో మంత్రి తుమ్మల కీలక ప్రకటన
వ్యవసాయ శాఖ పరిధిలో గల అన్ని కార్పొరేషన్‌లు సమర్థవంతంగా పనివేసేలా ప్రభుత్వం కార్యచరణతో ఉందని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రకటించారు.

దిశ, డైనమిక్ బ్యూరో: వ్యవసాయ శాఖ పరిధిలో గల అన్ని కార్పొరేషన్‌లు సమర్థవంతంగా పనివేసేలా ప్రభుత్వం కార్యచరణతో ఉందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు (Minister Tummala Nageswara Rao) ప్రకటించారు. శనివారం ఆగ్రో ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కార్యాలయం (Agro Industries Development Corporation) ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి తుమ్మల మాట్లాడుతూ.. ఎన్నో ఏళ్లుగా రైతాంగానికి సేవలు అందించిన ఆగ్రోస్ నిరర్ధకంగా మారిందని, దాన్ని పునరుద్ధరణ చేసి మళ్ళీ రైతాంగానికి సేవలు అందించేలా, తగిన కార్యాచరణ కోసం క్షేత్ర స్థాయిలో పర్యటన చేసినట్లు మంత్రి తుమ్మల ప్రకటించారు.
తుఫాన్‌తో నష్టపోయిన వారికి పది వేల పరిహారం..
మొంథా తుఫాన్ ప్రభావంతో నష్టపోయిన ప్రతి రైతును ఆదుకుంటామని సీఎం రేవంత్ రెడ్డి తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి రైతుల కష్టాలు చూశారని అన్నారు. ప్రతి ఎకరాకు పది వేల రూపాయల పంట నష్టపరిహారం చెల్లించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి తుమ్మల వెల్లడించారు. పత్తి రైతులు తేమ శాతం విషయంలో అప్రమత్తంగా ఉండాలని, మద్దతు ధర దక్కాలంటే జాగ్రత్తగా పత్తి ఆరబెట్టుకోవాలని మంత్రి తుమ్మల రైతాంగానికి సూచించారు.






