అగ్రికల్చర్ రైజింగ్.. వరి పంటలో పంజాబ్ ను దాటేసిన తెలంగాణ

by Ramesh Naini |

సుస్థిర పాలన, రైతులకు లాభం చేకూర్చే విధానాలు, విస్తరణ ఫలితాలతో రాష్ట్రంలో వ్యవసాయం రైజింగ్ అవుతోంది.

అగ్రికల్చర్ రైజింగ్.. వరి పంటలో పంజాబ్ ను దాటేసిన తెలంగాణ
X

దిశ, తెలంగాణ బ్యూరో/ డైనమిక్ బ్యూరో: సుస్థిర పాలన, రైతులకు లాభం చేకూర్చే విధానాలు, విస్తరణ ఫలితాలతో రాష్ట్రంలో వ్యవసాయం రైజింగ్ అవుతోంది. గడిచిన రెండేండ్లలో తెలంగాణ దేశమందరి దృష్టిని ఆకర్షించేలా పంటల సాగులో కొత్త రికార్డులు నెలకొల్పింది. వరి సాగు విస్తీర్ణం, దిగుబడిలో పంజాబ్‌ను దాటేసింది. రాష్ట్ర స్థూల ఉత్పత్తి విలువలో (GSVA) వ్యవసాయం వాటా 6.7 శాతం పెరిగింది. ప్రస్తుత ధరల ప్రకారం వ్యవసాయ రంగం వాటా గత ఏడాది రూ.1,00,004 కోట్లు నమోదవగా.. 20‌‌24‌‌–25 అంచనాల ప్రకారం రూ. 1,06,708కు చేరిందని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.

ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహంతో రాష్ట్రంలో పంటల సాగు విస్తీర్ణం పెరిగింది. 2023-24 సీజన్ లో 209.62 లక్షల ఎకరాల్లో అన్ని పంటలు సాగు చేయగా.. 296.17 లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడి వచ్చింది. 2024-25 సీజన్ లో సాగు విస్తీర్ణం ఏకంగా 220.77 లక్షలకు పెరిగింది. దిగుబడి 320.62 లక్షల మెట్రిక్ టన్నులకు చేరింది. తెలంగాణలో ప్రధాన పంటైన వరి 2023-24లో 118.11 లక్ష్లల ఎకరాల్లో సాగు చేశారు. 2024-25లో అది 127.03 లక్షల ఎకరాలకు పెరిగింది. ధాన్యం దిగుబడి 260.88 లక్షల మెట్రిక్ టన్నుల నుంచి.. ఈ ఏడాది వానాకాలం, యాసంగిలో కలిపి 284.16 లక్షల మెట్రిక్ టన్నులకు పెరిగింది. ధాన్యం ఉత్పత్తిలో తెలంగాణ దేశంలో అగ్రగామిగా నిలిచింది.

పత్తి సాగు విస్తీర్ణం ఇంచుమించుగా రెండేండ్లు ఒకే తీరుగా ఉంది. 49 నిరుటితో పోలిస్తే ఈ ఏడాది పత్తి కప్పాల ఉత్పత్తి 3.89 లక్షల టన్నులు పెరిగింది. 26.35 లక్షల టన్నుల నుంచి 30.24 లక్షల టన్నులకు చేరింది. తొలి రెండేండ్లలోనే ప్రజా ప్రభుత్వం రైతుల సంక్షేమానికి అత్యధిక ప్రాధాన్యమిచ్చింది. తెలంగాణ రైతులను దేశానికే ఆదర్శంగా నిలబెట్టాలనే సంకల్పంతో రూ.లక్ష కోట్లకు పైగా ఖర్చు చేసింది. రూ.54280 కోట్లతో వివిధ పథకాలను అమలు చేసింది. దేశంలోనే వరి సాగు విస్తీర్ణంలో తెలంగాణ నెంబర్ వన్ స్థానాన్ని నిలబెట్టుకుంది. 66.77 లక్షల ఎకరాల్లో వరి సాగు చేయగా గతంలో ఎన్నడూ లేని విధంగా 153 లక్షల టన్నుల దిగుబడి వచ్చింది.

Next Story