- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
యూరియా యాప్‌తో 50.48 లక్షల బస్తాలు బుకింగ్, అన్ని జిల్లాలో యాప్ సేవలు : వ్యవసాయ శాఖ
నేటి వరకు 12.73 లక్షల మంది రైతులు యాప్ ద్వారా 50.48 లక్షల యూరియా సంచులు బుక్ చేసుకున్నారు. వాటిలో 46.13 లక్షల సంచులు రైతులు ఇప్పటికే కొనుగోలు చేశారు.

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్ర ప్రభుత్వం రైతులకు ఎరువులు సమయానికి నిజమైన సాగుదారులకే చేరేలా యూరియా యాప్ తీసుకొచ్చింది. ఈ యాప్ ద్వారా రైతులు డీలర్ల వద్ద అందుబాటులో ఉన్న యూరియా నిల్వలను ఏ సమయంలో ఉన్నాయో తెలుసుకుని, ఇంటి నుంచే యూరియాను బుక్ చేసుకుంటున్నారు. దీంతో దుకాణాల వద్ద వేచి ఉండే సమయం తగ్గి, రద్దీ పరిస్థితులు లేవు. నేటి వరకు 12.73 లక్షల మంది రైతులు యాప్ ద్వారా 50.48 లక్షల యూరియా సంచులు బుక్ చేసుకున్నారు. వాటిలో 46.13 లక్షల సంచులు రైతులు ఇప్పటికే కొనుగోలు చేశారు. రైతుల ప్రయోజనాలే ప్రధాన లక్ష్యంగా, ఫీల్డ్ స్థాయిలో ఎదురయ్యే సమస్యలను ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ, సమీక్షిస్తూ, అవసరమైన సవరణలు చేస్తూ యూరియా యాప్ అమలు కొనసాగించబడుతోందని వ్యవసాయ శాఖ పేర్కొంది.
పట్టాదార్ పాస్ బుక్ రైతులు..
ఈ యాప్ ద్వారా పట్టాదార్ పాస్ బుక్ కలిగిన రైతులు, అటవీ హక్కుల చట్టం లబ్దిదారులు, భూమిని నిజంగా సాగు చేస్తున్న రైతులు మాత్రమే యూరియాను బుక్ చేసుకునే విధంగా నిబంధనలు అధికారులు అమలు చేస్తున్నారు. దీనివల్ల ఎరువులు నిజమైన రైతులకే చేరేలా పర్యవేక్షణ జరుగుతోంది. రైతు బుక్ చేసుకునే యూరియా సంచుల సంఖ్య పంట రకం, సాగు విస్తీర్ణం వ్యవసాయ విశ్వవిద్యాలయం సూచించిన శాస్త్రీయ సిఫార్సుల ఆధారంగా నిర్ణయించబడుతోంది. అర్హత ఉన్న మొత్తం పరిమాణాన్ని విడతల వారీగా విడుదల చేయడం ద్వారా శాస్త్రీయంగా సూచించిన విధంగా విడతల ఎరువుల వినియోగం జరుగుతోంది. దీంతో ఎరువుల వినియోగ సామర్థ్యం మెరుగుపడుతోంది. ఈ యాప్ మొదట ఐదు జిల్లాల్లో పైలట్ ప్రాజెక్టుగా అమలు చేసి, విజయవంతం కావడంతో రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు విస్తరించారు.
యూరియా సరఫరాపై మరింత భరోసా
ప్రారంభంలో జిల్లా యూనిట్‌ను బుకింగ్ యూనిట్‌గా నిర్ణయించగా, ఫీల్డ్ స్థాయి అవసరాల మేరకు అనేక ప్రాంతాల్లో మండలాల సమూహాన్ని యూనిట్‌గా నిర్ణయించారు. దీని వల్ల రైతులకు యూరియా సరఫరా పై మరింత భరోసా కలిగింది. యాప్ అమలును ఉన్నత స్థాయి అధికారుల నుండి ఫీల్డ్ స్థాయి అధికారుల వరకు నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. ఫీల్డ్ స్థాయిలో ఎదురయ్యే సమస్యలను సమీక్షిస్తూ అవసరమైన సవరణలు చేపడుతున్నట్లు వ్యవసాయ శాఖ తెలిపింది.






