కేంద్రం కేటాయించిన యూరియా సకాలంలో సరఫరా చేయాలి: వ్యవసాయ శాఖ డైరెక్టర్ గోపి

by Ajay Maddhiboyina |

కేంద్ర ప్రభుత్వం కేటాయించిన 1.70 లక్షల మెట్రిక్ టన్నుల యూరియాను సకాలంలో సరఫరా చేయాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ డైరెక్టర్ గోపి ఆదేశించారు.

కేంద్రం కేటాయించిన యూరియా సకాలంలో సరఫరా చేయాలి: వ్యవసాయ శాఖ డైరెక్టర్ గోపి
X

దిశ, తెలంగాణ బ్యూరో: కేంద్ర ప్రభుత్వం కేటాయించిన 1.70 లక్షల మెట్రిక్ టన్నుల యూరియాను సకాలంలో సరఫరా చేయాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ డైరెక్టర్ గోపి ఆదేశించారు. శుక్రవారం యూరియాను సరఫరా చేసే కంపనీ ప్రతినిధులతో సమావేశం అయ్యారు. ఈ నెలకు కేటాయించిన యూరియాను సకాలంలో సరఫరాచేయాలని, జాప్యం జరుగకుండా చర్యలు తీసుకోవాలని అన్నారు. వరి నాట్ల కారణంగా యూరియాకు ఎక్కువ డిమాండ్ ఉంటుందని, యూరియాతో పాటు ఇతర ఎరువుల సరఫరాలో జాప్యం జరిగితే ఇబ్బందులు తలెత్తుతాయని తెలిపారు.

రైతులు యూరియాను విచక్షణ రహితంగా వినియోగించకుండా వారికి డీలర్ల ద్వారా అవగాహన కల్పించాలని కంపనీ ప్రతినిధులకు సూచించారు. వ్యవసాయ అధికారులు ఎరువుల సరఫరాలో నిరంతరాయంగా పర్యవేక్షించాలని ఆదేశించారు. బల్క్ సేల్స్, బార్డర్ తనిఖీలు, బ్లాక్ మార్కెట్ అరికట్టేందుకు చర్యలు తీసుకోవాలని అన్నారు. వీటికి పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ సమావేశంలో మార్క్ ఫెడ్ ఎండీ శ్రీనివాస్ రెడ్డి, వ్యవసాయ శాఖ అదనపు సంచాలకులు విజయ్ కుమార్, జేడీఏ బాలు, వివిధ కంపనీల ప్రతినిధులు పాల్గొన్నారు.

Next Story