- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Aghori: అలుగునూరులో ప్రత్యక్షమైన అఘోరి.. మరోసారి సంచలన కామెంట్స్ వైరల్
తెలంగాణలో గత కొన్ని రోజులుగా ఓ అఘోరి (Aghori) సంచలనంగా మారిన సంగతి తెలిసిందే.

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణలో గత కొన్ని రోజులుగా ఓ అఘోరి (Aghori) సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. తనను తాను నాగసాధు అఘోరిగా చెప్పకుంటూ సంచలన కామెంట్స్ చేస్తూ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. తాజాగా అఘోరి కరీంనగర్ (Karimnagar) జిల్లా తిమ్మాపూర్ మండలం అలుగునూరులో ప్రత్యక్షమైంది. ఈ సందర్భంగా ఆమె అలుగునూరులో ఓ పెట్రోల్ పంప్ వద్ద తన కారును ఆపగా యువకులు ఆమెతో సెల్ఫీ దిగేందుకు ఉత్సాహం చూపారు. విషయం తెలుసుకున్న విలేకరులు ఆమెతో మాట్లాడారు.
ఈ సందర్భంగా అఘోరి మీడియాతో మాట్లాడుతూ.. తను (Maha Kumbh) మహా కుంభమేళా నుంచి వస్తున్నానని, ఫిబ్రవరి 3న వేములవాడలో ఉన్న మసీదును కూల్చేందుకు సిద్ధంగా ఉన్నానని మరోసారి సంచలన కామెంట్స్ చేశారు. సనాతన ధర్మాన్ని కాపాడే ప్రయత్నంలో తన ప్రాణాలు పోయినా లెక్క చేయనని చెప్పారు. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు హిందూ ధర్మాన్ని కాపాడడంలో ముందుంటానని, ఆడపిల్లల విషయంలో అన్యాయం జరిగిన తాను ముందుంటానని అన్నారు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది.






