- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Aghori Attacks : కొమురవెల్లి ఆలయం వద్ధ కత్తితో అఘోరీ బీభత్సం
తన వివాదస్పద వ్యవహార శైలితో తరుచూ వార్తల్లో నిలుస్తున్న అఘోరీ(Aghori)సిద్దిపేట జిల్లా కొమురవెల్లి ఆలయం(Komuravelli Temple) వద్ధ కత్తితో హింసాకాండ(violence with a knife)కు దిగింది.

దిశ, వెబ్ డెస్క్: తన వివాదస్పద వ్యవహార శైలితో తరుచూ వార్తల్లో నిలుస్తున్న అఘోరీ(Aghori)సిద్దిపేట జిల్లా కొమురవెల్లి ఆలయం(Komuravelli Temple) వద్ధ కత్తితో హింసాకాండ(violence with a knife)కు దిగింది. పూర్తి దిగంబరంగా ఆలయానికి వచ్చిన అఘోరీ ఆలయం ప్రధాన ద్వారం నుంచి తనను దర్శనానికి అనుమతించాలంటూ హల్చల్ చేసింది. అయితే వస్త్ర ధారణతో దర్శనానికి వస్తే అనుమతినిస్తామంటూ ఆలయ అధికారులు సూచించారు.
తనను ఇలాగే దర్శనానికి అనుమతించాలంటూ ఆలయ అధికారులతో వాగ్వివాదానికి దిగిన అఘోరీ కత్తితో అక్కడున్న వారిపై ఆకస్మికంగా(Knife attack)దాడి చేసింది. అఘోరీ దాడిలో పలువురికి గాయాలయ్యా(Many Injured)యి. మొదటి నుంచి కూడా అఘోరీ తెలుగు రాష్ట్రాల్లో తన వివాద్పద వైఖరితో ఉద్రిక్తతలు సృష్టిస్తున్నారు. సికింద్రాబాద్ ముత్యాలమ్మ గుడిలో పూజలతో వెలుగులోకి వచ్చిన మహిళా అఘోరి శ్రీకాళహస్తి సహా ఏపీలోని పలు దేవాలయాల సందర్శనల సందర్భంగా గొడవకు దిగింది.
శ్మశానాల్లో క్షుద్ర పూజలు చేస్తూ ఓసారి..మగ వేష ధారణలో మరోసారి కనిపిస్తూ ఏ రోజు ఎక్కడ దర్శనమిస్తుందో తేలియనంతంగా నిరంతరం ప్రయాణాలు..దైవ దర్శనాలు చేస్తూ తెలుగు రాష్ట్రాల్లో హల్చల్ చేస్తుంది. తాజాగా వేములవాడ ఆలయంలో మసీదును కూలుస్తానంటూ హెచ్చరికలు చేసింది.






