- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఏడాది తర్వాత బహిరంగ సభకు కేసీఆర్.. టార్గెట్ రేవంత్ రెడ్డి? మోడీ?
రేపు తెలంగాణ ఆసక్తికర పరిణామం చోటు చేసుకోబోతోంది. ఓ వైపు సీఎం రేవంత్ రెడ్డి మేడిగడ్డ పర్యటన, మరోవైపు జగిత్యాలలో కేసీఆర్ సభతో రాజకీయం ఆసక్తిగా మారింది.

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణ రాజకీయాల్లో మరోసారి పొలిటికల్ హీట్ పెరిగింది. ఓకే రోజు అధికార, ప్రతిపక్ష నేతల పర్యటనలు ఆసక్తిగా మారాయి. రేపు జగిత్యాలలో బహిరంగ సభకు బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ (KCR) హాజరు కాబోతుండగా అదే రోజు సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా ఉన్న మేడిగడ్డ బ్యారేజీ పరిశీలనకు వస్తుండటం సంచలనం రేపుతోంది. అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య ఒకే రోజు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పర్యటనలు ఉండటంతో రాష్ట్రంలో మరోసారి మైండ్ గేమ్ మొదలైందా అనే చర్చ తెరపైకి వస్తోంది.
ఏడాది తర్వాత పబ్లిక్ లోకి:
కాంగ్రెస్ మాజీ నేత జీవన్ రెడ్డి కారెక్కేందుకు సిద్ధం అయ్యారు. ఈ నేపథ్యంలో జగిత్యాలలో బీఆర్ఎస్ భారీ బహిరంగ సభను ఏర్పాటు చేస్తోంది. అయితే 2023 అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ఓటమి తర్వాత గులాబీ బాస్ కేసీఆర్ పబ్లిక్ లోకి రావడం లేదు. దాదాపు ఏడాది తర్వాత ఆయన బహిరంగ సభకు రాబోతున్నారు. గతేడాది ఏప్రిల్ 27న వరంగల్‍లో జరిగిన పార్టీ సిల్వర్ జూబ్లీ కార్యక్రమానికి హాజరైన కేసీఆర్ ఆ తర్వాత పబ్లిక్ మీటింగ్‍లకు ఎక్కడా హాజరు కాలేదు. అత్యంత ముఖ్యమైన కార్యక్రమాలు మినహా మిగతా అన్ని వ్యవహారాలు ఎర్రవల్లిలోని తన ఫామ్ హౌస్ నుంచే కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలో ఏడాది తర్వాత రేపు జగిత్యాల సభకు కేసీఆర్ వస్తుండటం స్టేట్ పాలిటిక్స్ లో ఆసక్తిగా మారింది.
రేవంత్ రెడ్డి? మోడీ?:
సుదీర్ఘ విరామం తర్వాత పబ్లిక్ మీటింగ్‍కు హాజరు కాబోతున్న కేసీఆర్.. ఈ సభ ద్వారా పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేయబోతున్నారు. అయితే ఇన్నాళ్లు పార్టీపై అధికార పక్షం తీవ్ర స్థాయిలో దాడి చేసినా మౌనంగా ఉన్న కేసీఆర్ జగిత్యాల సభ ద్వారా తన ప్రత్యర్థులకు ఎలాంటి కౌంటర్ ఇవ్వబోతున్నారు అనేది ఉత్కంఠగా మారింది. అసలు రేపటి సభలో ఆయన టార్గెట్ చేయబోయేది సీఎం రేవంత్ రెడ్డినా? లేక ప్రధాని మోడీనా అనేది సస్పెన్స్ గా మారింది. ఇవేవి కాకుండా తెలుగు రాష్ట్రాల్లోని రాజకీయ పరిణామాల దృష్ట్యా చంద్రబాబుపై విమర్శలు ఎక్కుపెడతారా అనేది వేచి చూడాలి.
కేసీఆర్ వైఫల్యాలే టార్గెట్గా రేవంత్ రెడ్డి స్కెచ్:
ఇక కేసీఆర్ సభ రోజే సీఎం రేవంత్ రెడ్డి మేడిగడ్డ పర్యటనకు వెళ్తుండటం హాట్ టాపిక్‍గా మారింది. మేడిగడ్డ వైఫల్యాలను క్షేత్రస్థాయిలో చూపించడంతో పాటు అక్కడికక్కడే బీఆర్ఎస్‍కు, కేసీఆర్‍కు కౌంటర్ ఇవ్వాలనేది రేవంత్ రెడ్డి ఆలోచనగా తెలుస్తోంది. ఇటీవలే కాళేశ్వరంలోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల మరమ్మతులు చేపట్టేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా రేపు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో కలిసి సీఎం మేడిగడ్డను పరిశీలించబోతున్నారు. కాళేశ్వరం విషయంలో ఈసారి సీఎం డోస్ ఎలా ఉండబోతోంది అనేది ఆసక్తిగా మారింది.






