- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
తుది దశకు చేరుకున్న ఫిరాయింపు ఎమ్మెల్యేల వ్యవహారం
రాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారిన ఫిరాయింపుల వ్యవహారం తుది దశకు చేరుతున్నది.

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారిన ఫిరాయింపుల వ్యవహారం తుది దశకు చేరుతున్నది. పార్టీ ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొంటున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేల అనర్హతపై అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్ శుక్రవారం విచారణ చేపట్టారు. అయితే.. ఈ విచారణకు ఎమ్మెల్యేలు ఎవరూ హాజరు కాలేదు. వారి తరపున అడ్వకేట్లు మాత్రమే హాజరై తమ వాదనలు వినిపించారు. ఇప్పటికే నలుగురు ఎమ్మెల్యేల క్రాస్-ఎగ్జామినేషన్ పూర్తయిన నేపథ్యంలో మిగిలిన కేసులు ఈ వారంలో ముగియనున్నాయి. ఫిరాయింపు నిరోధక చట్టం ప్రకారం స్పీకర్ విచారణలు చేస్తున్నారు. ఇందులో భాగంగా శుక్రవారం ముందుగా కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ వర్సెస్ టి.ప్రకాశ్‌గౌడ్ కేసు విచారణ జరిగింది.
ఇరుపక్షాల అడ్వకేట్లు ఓరల్ ఆర్గ్యుమెంట్స్ వినిపించారు. సంజయ్, ప్రకాశ్‌గౌడ్ కేసు విచారణ ముగిసిన వెంటనే.. కాలే యాదయ్య వర్సెస్ చింతా ప్రభాకర్ కేసు విచారణ చేపట్టారు. అనంతరం గూడెం మహిపాల్‌రెడ్డి వర్సెస్ చింతా ప్రభాకర్ కేసు విచారించారు. ఈ రెండింటిలోనూ ఇరుపక్షాల అడ్వకేట్లు వారి వారి వాదనలు వినిపించారు. అలాగే.. బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి వర్సెస్ పల్లా రాజేశ్వర్‌రెడ్డి కేసును సైతం స్పీకర్ గడ్డం ప్రసాద్ విచారించారు. మరో నలుగురు ఫిరాయింపు ఎమ్మెల్యేలను త్వరలోనే స్వీకర్ విచారించనున్నారు. కాగా.. ఎమ్మెల్యేల విచారణ నేపథ్యంలో ఈనెల 31 వరకు అసెంబ్లీ పరిసరాల్లో ఆంక్షలు విధించారు.






