ప్రతిపక్ష నేతగా కేసీఆర్ అసెంబ్లీకి హజరవ్వాలి

by Gantepaka Srikanth |

ప్రతిపక్ష నేతగా కేసీఆర్ అసెంబ్లీకి హజరవ్వాలి

ప్రతిపక్ష నేతగా కేసీఆర్ అసెంబ్లీకి హజరవ్వాలి
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాజ్యంగ నిబంధనలు పాటించి రేపటి నుంచి జరగనున్న అసెంబ్లీ సమావేశాలకు మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ హాజరవ్వాలని అడ్వకేట్ పాడూరి శ్రీనివాస్ రెడ్డి శనివారం మీడియాకు తెలిపారు. అసెంబ్లీ సమావేశాల సమయంలో కేసీఆర్ అవసరం లేదని.. మేమేం సరిపోతామని కేటీఆర్ మాట్లాడుతున్నారని.. ప్రజాస్వామ్యంలో ఇలాంటి వ్యాఖ్యలు సరికాదని అన్నారు. కేసీఆర్ అసెంబ్లీ సమావేశాలకు హాజరుకాకపోవడంతో తెలంగాణ ఫెడరేషన్ ఆఫ్ ఫార్మర్స్ లీగల్ నోటీసులు ఇచ్చినట్లు ఆయన పేర్కొన్నారు. ప్రతిపక్ష నేత హోదాలో కేసీఆర్ హాజరై ప్రభుత్వానికి సూచనలు చేయాలని సూచించారు. అదే విధంగా రైతుల సమస్యలపై కూడా ప్రభుత్వాన్ని ప్రశ్నించాలన్నారు. కేసీఆర్ రైతుల సమస్యలపై మాట్లాకుండా ఉండటం అంటే రైతుల గొంతు నొక్కయడమన్నారు.

Next Story