- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఈ నెల 19 నుంచి 23 వరకు వ్యవసాయ డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాలు
రాష్ట్రంలో అగ్రికల్చర్,ఉద్యాన, వెటర్నరీ విశ్వవిద్యాలయాల పరిధిలోని వివిధ వ్యవసాయ, అనుబంధ డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాల కోసం ఈనెల 19 నుంచి 23వ తేదీ వరకు

దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలో అగ్రికల్చర్,ఉద్యాన, వెటర్నరీ విశ్వవిద్యాలయాల పరిధిలోని వివిధ వ్యవసాయ, అనుబంధ డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాల కోసం ఈనెల 19 నుంచి 23వ తేదీ వరకు మొదటి దశ కౌన్సిలింగ్ నిర్వహిస్తున్నట్లు రిజిస్ట్రార్ డాక్టర్ విద్యాసాగర్ తెలిపారు. ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొంటూ ఈ కౌన్సిలింగ్ ను రాజేంద్రనగర్ లోని విశ్వవిద్యాలయ ఆడిటోరియంలో19 వ తేదీ నుంచి 23 వ తేదీ వరకూ ప్రతి రోజూ ఉదయం 9.30 గంటలకు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. ఈఏడాది వ్యవసాయ కూలీల పిల్లలకు తొలిసారి గా బీఎస్సీ (అగ్రికల్చర్), బీటెక్(ఫుడ్ టెక్నాలజీ) సీట్ల లో ప్రత్యేక కోటా అమలు చేయనున్నట్లు చెప్పారు. వీరికి ఈ కోర్సు లో 15 శాతం సీట్లు కేటాయించినట్లు వివరించారు. విద్యార్థులు తమ 4 వ తరగతి నుంచి 12 వ తరగతుల విద్యాభ్యాసం లో కనీసం నాలుగేళ్లు ప్రభుత్వ పాఠ శాలలు, కళాశాలలు, గురుకులాలు, ప్రభుత్వ సంస్థల్లో చదివిన విద్యార్థులు ఈ ప్రత్యేక కోటాకు అర్హులని తెలిపారు.
అదేవిధంగా విద్యార్థి పేరు మీద కానీ, తమ తల్లితండ్రుల పేరు మీద రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన గ్రామీణ ఉపాధి హమీ పథకం కార్డు కలిగి ఉన్న వారే ఈ కోటాలో చేరేందుకు అవకాశం ఉందని, విద్యార్థులకు కానీ అతని తల్లితండ్రులు, తాత ఎటువంటి వ్యవసాయ భూమి కలిగి ఉండరాదనీ స్పష్టం చేశారు. లేదంటే విద్యార్థులు, వారి తల్లి తండ్రుల పేరు మీద ఎకరం లోపు భూమి కలిగి,విద్యార్థులు తమ 4 వ తరగతి నుంచి 12 వ తరగతుల విద్యాభ్యాసం లో కనీసం నాలుగేళ్ళు ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలు, గురుకులాలు, ప్రభుత్వ సంస్థలలో చదివిన వారు కూడా ఈ సీట్ల పొందవచ్చన్నారు. అర్హతలకు సంబందించిన అన్ని దృవపత్రాలు తో కౌన్సిలింగ్ కు హాజరు కావాలని సూచించారు. బీ ఎస్సీ (అగ్రికల్చర్),బీ టెక్(ఫుడ్ టెక్నాలజీ) కోర్సులకు మొదటి సెమిస్టరుకు ఫీజు రూ. 49,560 ఉంటుందని తెలిపారు. పూర్తి వివరాలు విశ్వ విద్యాలయం వెబ్ సైట్ www.pjtau.edu.in లో చూడవచ్చని పేర్కొన్నారు.






