వచ్చే ఏడాది నుండి మోడల్ స్కూళ్లలో 5 వ తరగతిలో ప్రవేశాలు

by Muthe.Rajitha |

రాష్ట్రంలోని మోడల్ స్కూళ్లలో ప్రవేశ విధానంలో కీలక మార్పులు చోటుచేసుకోనున్నాయి.

వచ్చే ఏడాది నుండి మోడల్ స్కూళ్లలో 5 వ తరగతిలో ప్రవేశాలు
X

దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలోని మోడల్ స్కూళ్లలో ప్రవేశ విధానంలో కీలక మార్పులు చోటుచేసుకోనున్నాయి. ప్రస్తుత విద్యా సంవత్సరం వరకు 6వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు మాత్రమే ప్రవేశాలు నిర్వహిస్తోంది. కానీ వచ్చే విద్యా సంవత్సరం నుండి 5వ తరగతిలో కూడా అడ్మిషన్లు కల్పించాలని పాఠశాల విద్యాశాఖ ప్రతిపాదనలు సిద్దం చేస్తున్నట్లు తెలుస్తోంది. తద్వారా, మోడల్ స్కూళ్లను 5వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు విద్యను అందించే పూర్తి స్థాయి సంస్థలుగా మార్చాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.

ప్రభుత్వ ఆమోదం అనంతరం దీనిపై త్వరలోనే అధికారిక ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉంది. ఈ నిర్ణయం అమలులోకి వస్తే, గ్రామీణ ప్రాంతాల్లోని విద్యార్థులకు ప్రాథమిక స్థాయి నుంచే (5వ తరగతి) నాణ్యమైన, నాణ్యమైన విద్యను అందుబాటులోకి తీసుకురావడానికి అవకాశం ఉంటుందని విద్యా నిపుణులు అభిప్రాయపడుతున్నారు. దీనికి సంబంధించిన విధివిధానాలు, సీట్ల కేటాయింపు, ప్రవేశ పరీక్షల నిర్వహణపై త్వరలోనే స్పష్టత వచ్చే అవకాశం ఉంది. కాగా ఇప్పటివరకు రాష్ర్టంలో పలుచోట్ల మోడల్ స్కూల్స్ లో అడ్మిషన్లు ప్రతిఏటా పెరుగుతున్నాయి.

Next Story