ప్రభుత్వ స్కూళ్లలో 3 లక్షలు దాటిన అడ్మిషన్లు

by Ajay Maddhiboyina |

రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో అడ్మిషన్ల సంఖ్య పెరుగుతోంది. గత నెల 24 వరకు 2,56,156 విద్యార్థులు ప్రభుత్వ స్కూళ్లలో చేరగా ఇప్పటి వరకు ఆ సంఖ్య 3. 69 లక్షల మంది విద్యార్థులు ప్రభుత్వ స్కూళ్లలో చేరినట్లు స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టరేట్ అధికారులు వెల్లడించారు.

ప్రభుత్వ స్కూళ్లలో 3 లక్షలు దాటిన అడ్మిషన్లు
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో అడ్మిషన్ల సంఖ్య పెరుగుతోంది. గత నెల 24 వరకు 2,56,156 విద్యార్థులు ప్రభుత్వ స్కూళ్లలో చేరగా ఇప్పటి వరకు ఆ సంఖ్య 3. 69 లక్షల మంది విద్యార్థులు ప్రభుత్వ స్కూళ్లలో చేరినట్లు స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టరేట్ అధికారులు వెల్లడించారు. ప్రభుత్వం కల్పించిన సౌకర్యాలు, విద్యా నాణ్యతను పెంచడానికి చేపట్టిన పలు కార్యక్రమాల ఫలితంగా గతేడాది కంటే ఈ సంవత్సరం అడ్మిషన్లు పెరిగాయి. అందులో భాగంగా కొత్తగా ప్రభుత్వం గత సంవత్సరం జూన్ 24 నాటికి 2,00,901 అడ్మిషన్లు నమోదు కాగా, ఈ సంవత్సరం జూన్ 24 నాటికి ఈ సంఖ్య 2,56,156 కి చేరింది. ఆ సంఖ్య జులై మొదటి రెండో వారానికి 3 లక్షలు దాటడం మంచి పరిణామమని విద్యాశాఖ వర్గాలు అభిప్రాయపడుతున్నారు.

మూడున్నర లక్షలు దాటిన అడ్మిషన్లు:

రాష్ట్రంలోని సర్కారు బడుల్లో అడ్మిషన్లు జోరందుకున్నాయి. స్కూళ్లు ప్రారంభమైన రెండు వారాలకే 2 లక్షలకు పైగా అడ్మిషన్లు వచ్చాయి. జులై రెండో వారం నాటిని అంటే నెల రోజుల్లోగానే ఆసంఖ్య మూడు లక్షలకు పైగా చేరుకుంది. అయితే ప్రయివేటు స్కూళ్ల నుంచి ప్రభుత్వ స్కూళ్లకు వస్తున్న సంఖ్య కూడా పెరుగుతోంది. ప్రభుత్వం పాఠశాలల్లో అడ్మిషన్ల పెంపుకు ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమం సత్పలితాలు ఇచ్చిందని తెలుస్తొంది.

2025-26 విద్యాసంవత్సరానికి ప్రభుత్వ స్కూళ్లలో నేటి వరకు అడ్మిషన్లు:

జూన్ 24 నాటికి అడ్మిషన్ల వివరాలు

జూన్24 `ఫస్ట్ క్లాస్ 2 నుంచి టెన్త్ కి ప్రయివేటు నుంచి గవర్నమెంట్ ప్రభుత్వ స్కూళ్లలో అడ్మిషన్లు మొత్తం అడ్మిషన్లు

1,07,126 48,133 1,00,897 2,56,156

జులై 10 1.38 79,000 1,52,000 3,69,000

అడ్మిషన్లు ఓకే...భోధన సంగతేంటి:

ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన బడిబాట కార్యక్రమంతో పాటు, పలు కార్యక్రమాలు ప్రభుత్వ స్కూళ్లలో విద్యార్థుల సంఖ్య పెరగడానికి కారణమయ్యాయి. అయితే కొన్ని ప్రాథమిక పాఠశాలల్లో విద్యార్థులకు సరిపడా టీచర్లు లేరనే వాదనలు వినిపిస్తున్నాయి. ఎస్జీటీ టీచర్లు తక్కువగా ఉండడం, ఉన్న కొద్ది మంది ఇన్ సర్వీస్ కింద రెండేళ్ల బీఈడీ కోర్సు చేయడానికి లీవ్ లలో వెళ్లడం వంటి కారణాలతో విద్యార్థులకు సరిపడా టీచర్లు లేక పాఠాలు చెప్పే దిక్కు లేక విద్యార్థులు వెనకబడిపోతున్నారు. ఉన్న ప్రాథమిక స్కూళ్లలో కూడా రిజిస్టర్ మెయింటెనెన్స్, మిడ్డే మీల్స్ పర్యవేక్షణ, బోధన వంటి తీరిక లేని పనులతో సతమతమయ్యే పనులు ఉంటున్నాయి. విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా టీచర్లను సర్ధుబాటు చేస్తే మరిన్ని మెరుగైన ఫలితాలు సాధించవచ్చనే అభిప్రాయాన్ని పలువురు విద్యా వేత్తలు వ్యక్తం చేస్తున్నారు.

Next Story