బీఎస్సీ అగ్రికల్చర్ డ్యూయల్ ​కోర్సులకు ఈనెల 18న ప్రవేశాలు

by velandi.Saikiran |   (  Updated:2025-08-14 17:08:57  IST  )

బీఎస్సీ అగ్రికల్చర్ డ్యూయల్ ​కోర్సులకు ఈనెల 18న ప్రవేశాలు
X

బీఎస్సీ అగ్రికల్చర్ డ్యూయల్ ​కోర్సులకు ఈనెల 18న ప్రవేశాలు

అగ్రికల్చర్​ యూనివర్శిటీ రిజిష్ట్రార్ ​విద్యాసాగర్​ వెల్లడి

దిశ, తెలంగాణ బ్యూరో : అగ్రికల్చర్​యూనివర్శిటీ, ఆస్ట్రేలియా కు చెందిన వెస్ట్రన్ సిడ్నీ యూనివర్సిటీ లు సంయుక్తంగా అందిస్తున్న బీఎస్సీ అగ్రికల్చర్ డ్యూయల్ డిగ్రీ కోర్స్ లో ప్రవేశాలకు ఈ నెల 18వ తేదీన కౌన్సిలింగ్ నిర్వహిస్తున్నట్లు రిజిస్ట్రార్ డాక్టర్ జి ఈ సిహెచ్ విద్యాసాగర్ తెలిపారు. గురువారం ఒక ప్రకటనలో పేర్కొంటూ విశ్వవిద్యాలయం నోటిఫికేషన్ కు అనుగుణంగా ఇదివరకే దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు ఈ కౌన్సిలింగ్ కు హాజరు కావాలని సూచించారు. వెస్ట్రన్ సిడ్నీ యూనివర్సిటీ, ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం లు అందిస్తున్న ఈ కోర్సులో ప్రవేశాలకు సంబంధించిన కౌన్సిలింగ్ రాజేంద్రనగర్ లోని నీటి సాంకేతిక పరిజ్ఞాన కేంద్రం, ఆడిటోరియంలో 18 వ తేదీ ఉదయం 10 గంటలకు నిర్వహిస్తున్నారు.

అదే విధంగా ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం, కొండా లక్ష్మణ్ తెలంగాణ ఉద్యాన విశ్వవిద్యాలయం, పీవీ నరసింహారావు తెలంగాణ వెటర్నరీ విశ్వవిద్యాలయా ల పరిధిలోని వివిధ వ్యవసాయ, అనుబంధ డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాల కోసం ఈనెల 19 నుంచి 23వ తేదీ వరకు మొదటి దశ సంయుక్త కౌన్సిలింగ్ నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. ఈ కౌన్సిలింగ్ ను రాజేంద్రనగర్ లోని విశ్వవిద్యాలయ ఆడిటోరియంలో19 వ తేదీ నుంచి 23 వ తేదీ వరకూ ప్రతి రోజూ ఉదయం 9.30 గంటలకు నిర్వహిస్తున్నట్లు వివరించారు. ఈ కౌన్సిలింగ్ సంబంధించిన పూర్తి వివరాల కోసం విశ్వవిద్యాలయం వెబ్ సైట్​www.pjtau.edu.in లో చూడవచ్చన్నారు.

Next Story