‘నీ కొడుకును ఎంపీగా గెలిపించింది మేం కాదా?’.. వివేక్‌పై మంత్రి అడ్లూరి ఫైర్

by Gantepaka Srikanth |

కులం ఆధారంగా తనపై కుట్రలు, విమర్శలు చేస్తున్నారు.. చేయిస్తున్నారు అని మంత్రి వివేక్‌ వెంకటస్వామి(Vivek Venkataswamy) కీలక వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే.

‘నీ కొడుకును ఎంపీగా గెలిపించింది మేం కాదా?’.. వివేక్‌పై మంత్రి అడ్లూరి ఫైర్
X

దిశ, వెబ్‌డెస్క్: కులం ఆధారంగా తనపై కుట్రలు, విమర్శలు చేస్తున్నారు.. చేయిస్తున్నారు అని మంత్రి వివేక్‌ వెంకటస్వామి(Vivek Venkataswamy) కీలక వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌(Adluri Laxman Kumar)ను రెచ్చగొట్టి తనపై విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. మంత్రి లక్ష్మణ్ నాపై ఎందుకు విమర్శలు చేస్తున్నారో తెలియట్లేదు, సభలు, సమావేశాలు జరిగే సమయంలో ఆయన వచ్చినప్పుడు నేను వెళ్లిపోతున్నాననేది తప్పు, లక్ష్మణ్‌ను రాజకీయంగా ప్రోత్సహించింది మా నాన్నే, ఆ విషయాన్ని అడ్లూరి మర్చిపోయారు.. నాకు మంత్రి పదవిపై వ్యామోహం లేదు. జూబ్లీహిల్స్‌లో కాంగ్రెస్ గెలిస్తే వ్యక్తిగతంగా నాకు మంచి పేరు వస్తుందనే ఈ కుట్ర చేస్తున్నారని మంత్రి వివేక్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

తాజాగా వివేక్ వ్యాఖ్యలపై మంత్రి అడ్లూరి లక్ష్మణ్ స్పందించారు. ఆదివారం సాయంత్రం ఆయన ఓ మీడియా ఛానల్ ప్రతినిధితో మాట్లాడుతూ.. ముగిసిన వివాదాన్ని వివేక్ మళ్లీ తెరమీదకు తెస్తున్నారు.. ఇక నేను ఏం మాట్లాడను.. వివేక్ అంశాన్ని అధిష్టానం చూసుకుంటుంది. వివేక్ వ్యాఖ్యలు ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నా.. వివేక్ కొడుకు(Gaddam Vamshi Krishna)ను ఎంపీగా గెలిపించింది ఎవరో ఆయనకు కూడా తెలుసు.. ఎవరు ఎవరిని అవమానిస్తున్నారో చర్చకు సిద్ధం’ అని వివేక్‌కు అడ్లూరి లక్ష్మణ్ సవాల్ చేశారు.

Next Story