- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
సంక్షేమ గురుకులాల్లో విద్యా ప్రమాణాల పెంపునకు కృషి
సంక్షేమ గురుకులాల్లో విద్యా ప్రమాణాల పెంపునకు కృషి చేయాలని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అధికారులను ఆదేశించారు.

దిశ, తెలంగాణ బ్యూరో: సంక్షేమ గురుకులాల్లో విద్యా ప్రమాణాల పెంపునకు కృషి చేయాలని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అధికారులను ఆదేశించారు. తెలంగాణ రాష్ట్ర సాంఘీక సంక్షేమ శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తరువాత మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తొలిసారిగా రాష్ట్రంలోని సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాలలో పని చేస్తున్న జోనల్ అధికారులు, ప్రిన్సిపల్స్ తో ఒరియంటేషన్ కార్యక్రమాన్ని ఎంసీహెచ్ఆర్డీ కేంద్రం బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా పర్యావరణ అవగాహన పెంపొందించేందుకు టీజీఎస్డబ్ల్యూఆర్ఈఐఎస్తో ఈ మేరకు డబ్ల్యూడబ్ల్యూఎఫ్ఇండియా ఈ మేరకు ‘మిషన్ ప్రకృతి’పై ఎంవోయూ కుదుర్చుకుంది. ఈ కార్యక్రమానికి సాంఘీక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరై, సంస్థ చేపట్టిన అనేక వినూత్న కార్యక్రమాలను ప్రస్తావించారు. రాష్ట్రంలోని అన్ని సంక్షేమ వసతి గృహాల్లో పౌర సరఫరాల శాఖతో సమన్వయం చేసి, నాణ్యమైన , ఫైన్ రకం బియ్యం అందించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. సంక్షేమ హాస్టళ్లలో ఇక నుండి అల్యూమినియం పాత్రలకు బదులుగా స్టీల్ పాత్రలు వినియోగివంచుకోవాలన్నారు. వంటల విషయంలోనూ, వంటకాల పాత్రల విషయంలోనే తగిన చొరవ చూపాలన్నారు. పాత పాత్రలు వినియోగించే చోట ఇందుకు అయ్యే ఖర్చుల అంచనా నివేదిక సమర్పించాలని మంత్రి అధికారులకు సూచించారు. సంక్షేమ హాస్టళ్ల ప్రిన్సిపాళ్లకు సర్వీస్ మ్యాటర్ కు సంబంధిత అంశాలను నియమావళి మేరకు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.
గతంలో విద్యార్థులు డార్మెటరీల్లోనే పాఠాలు విని, అక్కడే తిన్న ఘటనలు విన్నప్పుడు ఎంతో బాధ కలిగిందని, ఇకపై హాస్టళ్లను స్వయంగా పర్యటించి సమస్యలను నేరుగా తెలుసుకుంటానని మంత్రి అడ్లూరి లక్ష్మణ్తెలిపారు. ముఖ్యంగా సాంఘిక సంక్షేమ శాఖ పరంగా విద్యార్థులకు ఆరోగ్య పరిరక్షణపై ప్రత్యేక దృష్టి పెట్టాలని, అందుకోసం ఆరోగ్యశాఖ కార్యదర్శి క్రిస్టినా తో ఇప్పటికే సూచనలు చేసినట్లు తెలిపారు. ప్రతి హాస్టల్‌కు 15 రోజులకు ఒక సారి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నుండి వైద్య బృందం వచ్చి విద్యార్థులకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించేలా చర్యలు తీసుకుంటామని మంత్రి స్పష్టం చేశారు. తాను కూడా ఒక సామాన్య కుటుంబం నుంచి వచ్చి ఈ గురుకులాల్లోనే చదువుకున్న విద్యార్థినేనని, మంత్రిగా బాధ్యతలు తెలిసినవాడినని మంత్రి చెప్పారు. విద్యా ప్రమాణాల పెంపే లక్ష్యంగా అధ్యాపకులు పనిచేయాలని మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ దిశ నిర్దేశం చేశారు.
విద్యార్థుల హితాన్ని దృష్టిలో పెట్టుకొని, సబ్జెక్ట్ వారీగా వెనుకబడ్డ వారిపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని జోనల్ అధికారులకు, ప్రిన్సిపాళ్లకు మంత్రి ఆదేశాలు జారీ చేశారు. ముఖ్యంగా డైనింగ్ హాల్స్, మెస్‌లో ఎలాంటి నిబంధనల ఉల్లంఘన జరగకుండా చూడాలని, వసతి గృహాల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని అన్నారు. సంక్షేమ హాస్టళ్లకు అవసరమైన నిధుల కోసం ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క తో మాట్లాడి వెంటనే మంజూరు చేయిస్తామని హామీ ఇచ్చారు. పరకాల డిగ్రీ కళాశాల తాత్కాలిక మరమ్మత్తులకు అవసరమైన నిధులను ఇన్‌చార్జి మంత్రితో మాట్లాడి ఆ కలెక్టర్‌తో సమన్వయం చేసుకొని వీలైనంత త్వరగా పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. గత ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల డైట్ చార్జీలు, కాస్మెటిక్ ఛార్జీల పెంపుపై దృష్టి సారించలేదని తమ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే మెస్ , కాస్మెటిక్ చార్జిలను పెంచిన విషయాన్ని గుర్తు చేశారు. వచ్చే విద్యా సంవత్సరం ప్రారంభానికి ముందే యూనిఫాం, షూస్, పుస్తకాలు అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. సర్వీస్ మేటర్, 010 పద్దు వేతనాలు, హెల్త్ కార్డుల పరిష్కారానికి ప్రభుత ముఖ్య కార్యదర్శితో మాట్లాడి పరిష్కరించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. పిల్లలకు అందించే మెస్ విషయంలో అందులో జరిగే చిన్నపాటి లోటుపాట్లపై ప్రతిపక్షాలు, సోషల్ మీడియాలో బురద జల్లినా, అధికారులు నిర్లక్ష్యం చేయకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని మంత్రి అడ్లూరి అధికారులకు ఆదేశించారు. అనంతరం టీజీఎస్డబ్ల్యూఆర్ఈఐఎస్కార్యదర్శి డా. వి.ఎస్. అలగు వర్షిణి మాట్లాడుతూ ఇంత వరకు గురుకులలో చేపట్టిన విభిన్న వినూత్నమైన కార్యక్రమాలను వివరించారు. ఈ సందర్భంగా సంక్షేమ వసతి గృహాలకు సంబంధించి పూర్తిగా అండదండలు అందిస్తారని చెప్పిన మంత్రికి ఆమె కృతజ్ఞతలు తెలిపారు. ఈ ప్రభుత్వనికి అండగా ఉండడంతో సంస్థ మరిన్ని నూతన లక్ష్యాలను చేరగలదని ఆమె అభిప్రాయపడ్డారు.






