- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Revanth Reddy: జన్వాడ్ ఫామ్ హౌస్ కేసు.. రేవంత్ రెడ్డి పిటిషన్ పై విచారణ వాయిదా
రేవంత్ రెడ్డి పిటిషన్ పై హైకోర్టులో విచారణ వాయిదా పడింది.

X
దిశ, డైనమిక్ బ్యూరో: జన్వాడ ఫామ్ హౌస్ (Janwada Farm House) వద్ద డ్రోన్ ఎగురవేశారని తనపై నమోదైన కేసులో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) దాఖలు చేసిన పిటిషన్ విచారణ తెలంగాణ హైకోర్టు (High Court) వాయిదా వేసింది. విచారణను ఈ నెల 20వ తేదీకి వాయిదా వేసింది. డ్రోన్ ఎగురవేశారని 2020 మార్చిలో రేవంత్ రెడ్డిపై నార్సింగి పోలీసులు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. అయితే పోలీసులు తప్పుడు సెక్షన్లు నమోదు చేశారని పిటిషన్ లో వెల్లడించారు. ఈ పిటిషన్ ను సోమవారం హైకోర్టు విచారణ చేపట్టింది. విచారణ సందర్భంగా సీనియర్ న్యాయవాది కేసును వాదిస్తారని రేవంత్ రెడ్డి తరపు న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకువెళ్లారు. అనంతరం విచారణను ఈ నెల 20 కి కోర్టు వాయిదా వేసింది.
Next Story






