ZPTC, MPTC నామినేష‌న్ల‌ను ప‌కడ్బందీగా నిర్వ‌హించాలి క‌లెక్ట‌ర్

by Nallavelli.Anjaneyulu |

దిశ‌, క‌డెం : నిర్మల్ జిల్లాలో జరుగుతున్న తొలి విడత ZPTC, MPTC ఎన్నికల నామినేషన్ల ప్రక్రియను సమర్థవంతంగా, పారదర్శకంగా నిర్వహించాలని కలెక్టర్ అభిలాష అభినవ్

ZPTC, MPTC నామినేష‌న్ల‌ను ప‌కడ్బందీగా నిర్వ‌హించాలి క‌లెక్ట‌ర్
X

దిశ‌, క‌డెం : నిర్మల్ జిల్లాలో జరుగుతున్న తొలి విడత ZPTC, MPTC ఎన్నికల నామినేషన్ల ప్రక్రియను సమర్థవంతంగా, పారదర్శకంగా నిర్వహించాలని కలెక్టర్ అభిలాష అభినవ్ సూచించారు. గురువారం నిర్మల్ జిల్లా కడెం మండల కేంద్రంలోని మండల పరిషత్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన నామినేషన్ స్వీకరణ కేంద్రాన్ని ఆమె తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. అభ్యర్థులకు సకాలంలో సమాచారం అందించేందుకు హెల్ప్‌డెస్క్ సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని సూచించారు. నామినేషన్ దాఖలు ప్రక్రియలో అధికారులు ఖచ్చితంగా సమయపాలన పాటించాలని ఆదేశించారు. ప్రతి రోజు స్వీకరించిన పత్రాలను భద్రపరచి, సంబంధిత రిజిస్టర్లలో నమోదు చేయాలని తెలిపారు. ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా సాగేందుకు పోలీసు బందోబస్తు ఏర్పాట్లు చేయాలని సూచించారు. నామినేషన్లపై రోజు వారీ నివేదికలను కలెక్టరేట్‌కు పంపాలని తెలిపారు. ఈ పరిశీలనలో జెడ్పీ సీఈవో గోవింద్, డీఆర్డివో విజయలక్ష్మి, తహసిల్దార్ ప్రభాకర్, ఎంపీడీఓ అరుణతో పాటు ఎన్నికల అధికారులు పాల్గొన్నారు.


Next Story