తీవ్ర నొప్పి... తట్టుకోలేక యువకుడి ఆత్మహత్య

by Bhanu |

కడుపు నొప్పిని భరించలేక ఓ యువకుడు జీవితాన్ని చేజార్చుకున్న విషాద ఘటన కెరమెరి మండలంలో చోటుచేసుకుంది.

తీవ్ర నొప్పి... తట్టుకోలేక యువకుడి ఆత్మహత్య
X

దిశ, ఆసిఫాబాద్: కడుపు నొప్పిని భరించలేక ఓ యువకుడు జీవితాన్ని చేజార్చుకున్న విషాద ఘటన కెరమెరి మండలంలో చోటుచేసుకుంది. పోలీసుల సమాచారం ప్రకారం, స్థానికంగా నివసించే సండే ఆకాష్ (21) గత కొన్ని రోజులుగా తీవ్ర కడుపు నొప్పితో బాధపడుతున్నాడు. తాజాగా మంగళవారం రాత్రి నొప్పి మళ్లీ అధికమవడంతో తీవ్ర ఒత్తిడికి లోనైన ఆకాష్, బాధను తట్టుకోలేక పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు.


విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు వెంటనే అతన్ని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అక్కడ ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన వైద్యానికి ఆసిఫాబాద్ జిల్లా ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందినట్లు ఎస్‌ఐ మధుకర్ తెలిపారు. ఈ ఘటనతో గ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది. ఆరోగ్య సమస్యలపై సమయానికి సరైన వైద్యం అందకపోతే ఇలా యువజీవితాలు బలైపోతున్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Next Story