విద్యుత్ షాక్ కి యువ‌కుడు బ‌లి

by Ratna Kumari |   (  Updated:2025-10-22 10:04:11  IST  )

దిశ‌, ఖానాపూర్ : విద్యుత్ షాక్ కి చుట్టంగా వ‌చ్చిన యువ‌కుడు బలైన ఘ‌ట‌న నిర్మ‌ల్ జిల్లా ఖానాపూర్ మండ‌ల ప‌రిధిలో చోటు చేసుకుంది. వివ‌రాల్లోకి వెళ్లితే.. మంచిర్యాల

విద్యుత్ షాక్ కి యువ‌కుడు బ‌లి
X

దిశ‌, ఖానాపూర్ : విద్యుత్ షాక్ కి చుట్టంగా వ‌చ్చిన యువ‌కుడు బలైన ఘ‌ట‌న నిర్మ‌ల్ జిల్లా ఖానాపూర్ మండ‌ల ప‌రిధిలో చోటు చేసుకుంది. వివ‌రాల్లోకి వెళ్లితే.. మంచిర్యాల జిల్లా నార్నూరు మండలంలోని నాగులకొండ గ్రామానికి చెందిన గజానంద్ (35) అనే యువకుడు బీర్ నంది గ్రామపంచాయతీ పరిధిలోని తుమ్మ గూడెం గ్రామానికి చెందిన జ్యోతిరావు ఇంటికి గత 20 రోజుల క్రితం చుట్టంగా వచ్చాడు. అయితే బీర్ నంది గ్రామానికి చెందిన శ్రీనివాస్ రెడ్డి అనే రైతు తన పంట పొలంలో అడవి పందుల నుంచి పంట‌ను కాపాడుకునేందుకు పొలం చెట్లూ విద్యుత్ కంచె ఏర్పాటు చేశాడు. అయితే మంగళవారం రోజు రాత్రి గజానంద్ అటువైపు వెళ్లాడు. దీంతో అత‌నికి విద్యుత్ వైర్లు తగిలి మృతి చెందాడు. దీంతో చుట్టంగా వ‌చ్చి క‌రెంట్ షాక్ తో చ‌నిపోయాడ‌ని గ్రామ‌స్తులంద‌రూ చ‌ర్చించుకుంటున్నారు. ఘ‌ట‌న స్థ‌లానికి ఖానాపూర్ సీఐ అజ‌య్, ఎస్ఐ రాహుల్ గైక్వాడ్ చేరుకొని ద‌ర్యాప్తు చేస్తున్న‌ట్టు తెలిపారు.

Next Story