48 గంటల్లో మహిళ హత్య కేసు ఛేదన..

by Kodari Anjali |

మహిళ అనుమానాస్పదంగా మృతిని పోలీసులు 24 గంటల్లోనే ఛేదించారు.

48 గంటల్లో మహిళ హత్య కేసు ఛేదన..
X

దిశ, ఆదిలాబాద్: ఆదిలాబాద్ పట్టణంలోని పంజాబ్ కూడలి సమీపంలో మురికి కాలువలో అనుమానాస్పదంగా మృతి చెందిన మహిళ అనిత కేసును వన్‌టౌన్ పోలీసులు హత్య కేసుగా ఛేదించారు. ఏప్రిల్ 24 అర్ధరాత్రి పంజాబ్ చౌక్‌లోని హల్దీరామ్ షాప్ సమీప డ్రైనేజ్‌లో మహిళ మృతదేహం లభ్యమవడంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. దర్యాప్తులో నిందితుడు నర్సింగా సంతోబా గంపల్వాడ్ (25), మహారాష్ట్రకు చెందిన వ్యక్తిగా గుర్తించారు. సంఘటన రోజు మద్యం సేవించిన నిందితుడు రోడ్డుపై నిద్రిస్తున్న మహిళను మురికి కాలువ వద్దకు తీసుకెళ్లి లైంగిక దాడికి యత్నించాడు. బాధితురాలు ప్రతిఘటించడంతో ఆగ్రహంతో గొంతు పట్టి హత్య చేసి, ఆధారాలు చెరిపేందుకు మృతదేహాన్ని డ్రైనేజ్‌లో పడేసినట్లు పోలీసులు వెల్లడించారు. సీసీటీవీ ఫుటేజీలు, సాంకేతిక ఆధారాల సహాయంతో కేవలం 48 గంటల్లోనే నిందితుడిని గుర్తించి ఆదిలాబాద్ రైల్వే స్టేషన్ సమీపంలో అరెస్ట్ చేశారు. అనంతరం కోర్టులో హాజరు పరచి, రిమాండ్‌కు తరలించారు. కేసును వేగంగా ఛేదించిన పోలీసు సిబ్బందిని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ అభినందించి ప్రశంసా పత్రాలు, నగదు రివార్డులు అందజేశారు.

Next Story