ప్రమాదశాత్తు ట్రాక్టర్ కింద పడి మహిళా రైతు మృతి

by Bhanu |

పెంబి మండలం నాగపూర్ గ్రామంలో ఆదివారం విషాదకర ఘటన చోటుచేసుకుంది.

ప్రమాదశాత్తు ట్రాక్టర్ కింద పడి మహిళా రైతు మృతి
X

దిశ, పెంబి: పెంబి మండలం నాగపూర్ గ్రామంలో ఆదివారం విషాదకర ఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన మహిళా రైతు పోతారాజు లక్ష్మి (40) తాను వ్యవసాయ పనుల కోసం ట్రాక్టర్‌ను తోటలో లెవలింగ్ చేయించేందుకు తీసుకెళ్లిన సమయంలో, ట్రాక్టర్ ప్రమాదవశాత్తు ఆమెకు ఢీకొనడంతో ఘటనా స్థలంలోనే మరణించినట్లు ఎస్సై హన్మాండ్లు తెలిపారు. మృతురాలికి భర్త, ఓ కుమారుడు, కుమార్తె ఉన్నారు. ఈ ఘటనపై కుమార్తె శృతి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.

Next Story