భర్తను హత్య చేసిన భార్య అరెస్ట్

by Jakkula.Mamatha |

ఆదిలాబాద్ రూరల్ మండలం లోహార గ్రామంలో భర్తను హత్య చేసిన భార్యను పోలీసులు అరెస్ట్ చేశారు.

భర్తను హత్య చేసిన భార్య అరెస్ట్
X

దిశ,ఆదిలాబాద్ రూరల్: ఆదిలాబాద్ రూరల్ మండలం లోహార గ్రామంలో భర్తను హత్య చేసిన భార్యను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ మేరకు గురువారం కేసు వివరాలను రూరల్ సీఐ కె.ఫణిధర్ వెల్లడించారు. ఉట్నూర్‌కు చెందిన సోలంకి గణపతి(54), భార్య మధురాబాయి(52)తో కలిసి కమ్మరి పని చేస్తూ జీవనం సాగించేవారు. ఇటీవల లోహార గ్రామంలో తాత్కాలిక డేరా వేసుకుని నివాసం ఉంటున్నారు.

గణపతి మద్యానికి బానిసై తరచూ భార్యను వేధించేవాడని, ఈ వేధింపులు తట్టుకోలేక మధురాబాయి ఈ నెల 28న రాత్రి అతను నిద్రిస్తున్న సమయంలో ఇనుప రాడ్‌తో తలపై కొట్టి హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు. మృతుడి కుమారుడు సురేష్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి నిందితురాలిని అరెస్ట్ చేసి, హత్యకు ఉపయోగించిన ఇనుప రాడ్‌ను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం ఆమెను రిమాండ్‌కు తరలించారు.

Next Story