వడ్డీ వ్యాపారులపై కొరడా..!

by Nallavelli.Anjaneyulu |

ఆదిలాబాద్ జిల్లాలో అధిక వడ్డీలతో రైతులు, అమాయక ప్రజలను దోచుకుంటున్న వడ్డీ వ్యాపారులపై ఎస్పీ అఖిల్ మహాజన్ కొరడా ఝులిపించారు.

వడ్డీ వ్యాపారులపై కొరడా..!
X

దిశ, ఆదిలాబాద్ : ఆదిలాబాద్ జిల్లాలో అధిక వడ్డీలతో రైతులు, అమాయక ప్రజలను దోచుకుంటున్న వడ్డీ వ్యాపారులపై ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపీఎస్ కొరడా ఝులిపించారు. గురువారం జిల్లావ్యాప్తంగా 16 మండలాల్లో 45 బృందాలతో ఏకకాలంలో ఆకస్మిక దాడులు నిర్వహించారు.ఈ దాడుల్లో వ్యవసాయ భూములు తాకట్టు పెట్టించుకుని, భూములను తమ పేర్లపై రాయించుకుని వడ్డీ వ్యాపారం చేస్తున్న వారిని గుర్తించారు. వడ్డీ వ్యాపారుల వద్ద నుంచి ప్రామిసరీ నోట్లు, చెక్కులు, పాస్‌బుక్కులు, బాండ్ పేపర్లు, స్టాంప్ పేపర్లు, ఖాళీ పత్రాలు, సేల్ డీడ్లు స్వాధీనం చేసుకున్నారు. జిల్లాలోని 7 పోలీస్ స్టేషన్ల పరిధిలో మొత్తం 15 కేసులు నమోదు చేశారు. ఆదిలాబాద్ టూ టౌన్, తలమడుగు, మావల, నేరడిగొండ, తాంసి, ఇచ్చోడ, గుడిహత్నూర్ పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి. ప్రజలను మోసం చేసే వారిపై కఠిన చర్యలు కొనసాగుతాయని, అసాంఘిక కార్యకలాపాలను పూర్తిగా రూపుమాపే దిశగా జిల్లా పోలీస్ శాఖ పనిచేస్తోందని ఎస్పీ తెలిపారు. అధిక వడ్డీల పేరుతో ప్రజలను వేధించే వడ్డీ వ్యాపారులు తమ అక్రమాలను మానుకోవాలని హెచ్చరించారు.

Next Story