- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్

దిశ, జన్నారం : సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించాలని ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ అన్నారు. సోమవారం మండల కేంద్రంలోని ఆర్ఆర్ ఫంక్షన్ హాల్లో నిర్వహించిన కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. త్వరలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కలిసికట్టుగా ఉంటూ పార్టీ అభ్యర్థులను గెలిపించుకోవాలని అన్నారు. అనంతరం ఎంపీటీసీలుగా పోటీ చేసే ఆశ వాహులతో గ్రామ గ్రామాల వారిగా మాట్లాడారు. అదేవిధంగా ఎంపీటీసీ పరిధిలో గల కార్యకర్తల అభిప్రాయాలు తెలుసుకున్నారు. గత ఎన్నికల్లో బిజెపి చేసిన ఓటు చోరీ గురించి కార్యకర్తలకు వివరించి సంబంధించిన కరపత్రాలను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ దుర్గం లక్ష్మీనారాయణ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు ముజఫర్ అలీ ఖాన్, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ ఫసిఉల్లా, మాజీ చైర్మన్ ముత్యం సతీష్, పార్టీ నాయకులు సుభాష్ రెడ్డి, దాముక కరుణాకర్, యాతం నాగేష్, రాజన్న యాదవ్, రమేష్, శంకరయ్య, నందు నాయక్ పాల్గొన్నారు






