- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ముంపు బాధితులను ఆదుకుంటాం - బెల్లంపల్లి ఎమ్మెల్యే
భారీ వర్షాలకు నష్టపోయిన ముంపు బాధితులను కాంగ్రెస్ ప్రభుత్వం ఆదుకుంటుందని బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్

దిశ, కన్నెపల్లి: ఇటీవల కురిసిన భారీ వర్షాలకు నష్టపోయిన ముంపు బాధితులను అన్ని రకాలుగా కాంగ్రెస్ ప్రభుత్వం ఆదుకుంటుందని బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ వెంకటస్వామి అన్నారు. శనివారం సాలిగాం గ్రామంలో పాల్వాయి పురుషోత్తం రావు ప్రాజెక్ట్ వరద బ్యాక్ వాటర్ తో ముంపు గురైన ప్రాంతాల్లో బెల్లంపల్లి మార్కెట్ కమిటీ మాజీ వైస్ చైర్మన్ మాధవరపు నర్సింగరావు తో కలిసి పరిశీలించారు. అనంతరం అక్కడ ప్రజలతో గడ్డం వినోద్ మాట్లాడుతూ.... వరద ఎక్కువ ఉన్న సమయంలో ముంపునకు గురవుతున్న ఇండ్లను పరిశీలించి ప్రభుత్వం నుండి మీకు సాయం అందేలా చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు.
మీకు గతంలో రావాల్సిన పునవారవాస నష్టపరిహారాన్ని అందేలా ఉన్నతాధికారులతో మాట్లాడి సమస్య పరిష్కరిస్తామన్నారు. వీరి వెంట తహాశీల్దార్ శ్రావణ్ కుమార్, ఎంపీడీవో శ్రీనివాస్ రెడ్డి, ఏవో సాయిప్రశాంత్, ఎస్ఐ భాస్కర్ రావు,కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఉపాధ్యక్షులు ఎల్పుల రోహిత్, కన్నెపల్లి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పప్పుల రామాంజనేయులు,మాజీ జడ్పీటీసీ కౌటారపు సత్యనారాయణ, మాజీ వైస్ ఎంపిపి రాకేష్ శర్మ, కాంగ్రెస్ పార్టీ నాయకులు, రైతులు పాల్గొన్నారు.






