- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మినరల్ కాదు.. అంతా జనరలే
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా మినరల్ వాటర్ ప్లాంట్లు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నారు. ఫ్యూరిపైడ్ వాటర్ పేరుతో సాధారణ నీటిని సరఫరా చేస్తూ ప్రజలను మోసం చేస్తూ.. వారి ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు.

దిశ, ఆసిఫాబాద్ : ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా మినరల్ వాటర్ ప్లాంట్లు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నారు. ఫ్యూరిపైడ్ వాటర్ పేరుతో సాధారణ నీటిని సరఫరా చేస్తూ ప్రజలను మోసం చేస్తూ.. వారి ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు. నిబంధనలకు విరుద్ధంగా ప్లాంట్లను నిర్వహిస్తున్న తనిఖీలు చేసి చర్యలు తీసుకోవా ల్సిన సంబంధిత అధికారులు తమకేమీ పట్టనట్టుగా వ్వవహారిస్తున్నారు. ఒక్క కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలోనే దాదాపుగా 80కు పైగా మినరల్ వాటర్ ప్లాంట్లు ఉన్నాయి. ఇక ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే 200 పై మాటే ఉండొచ్చు. ఇక ఇందులో కొన్నింటికి తప్ప మిగతా ఏ వాటర్ ప్లాంట్లకు ఐఎస్ఐ రిజిస్ట్రేషన్ అనుమతులు లేకున్నా రోజు వేల లీటర్ల వాటర్ విక్రయించి లక్షల్లో సొమ్ము చేసుకుంటున్నారు. ఈ నీటిని తాగినా వారికి అనేక ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి.
మినరల్ మాటున దందా..!
మినరల్ వాటర్ పేరుతో వాటర్ ప్లాంట్ల యాజమాన్యాలు నీటిని శుద్ధి చేయకుండానే క్యాన్ల లో నింపి నీళ్ల దందా చేస్తున్నారు. నీటి నిల్వ చేసే వాటర్ ట్యాంక్ లను నెలల తరబడి శుభ్రం చేయకుండా వాడటంతో నాచు పేరుకుపోయి అధ్వానంగా మారాయి. నీటిని శుద్ధి చేసిన తర్వాత నిబంధనల ప్రకారం.. తేదీ వివరాలను క్యాన్ల పై స్టీక్కర్ చేయాల్సి ఉన్నా ప్లాంట్లు యాజమాన్యాలు ఎవరు ఈ నిబంధనలు పాటించడం లేదు. కానీసం ప్లాంట్ వద్ద అర్హత గల ల్యాబ్ టెక్నీషియన్ ఉండి రోజూ నీటిని పరీక్షించి కాలుష్యం, మెగ్నీషియం ఎంత మోతాదులో ఉందో పరీక్షించిన తర్వాత నీటిని సరఫరా చేయాలి. కానీ అవేమి లేకుండా కొందరు అపరిశుభ్రమైన నల్లాల ద్వారా వచ్చే నీటిలో రుచికరమైన కెమికల్స్ కలిపి నీళ్లను సరఫరా చేస్తూ ప్రజల ఆరోగ్యంతో ఆటలాడుతున్నారు.
చోద్యం చూస్తున్న పాలకులు..!
వాటర్ ప్లాంట్లు ఐఎస్ఐ అనుమతి పొందాలంటే 1లక్ష వరకు ప్రభుత్వానికి చెల్లించాల్సి ఉంటుంది. ప్రతి నెల పర్యవేక్షణ కొరకు పది వేలు సంవత్సరానికి ఒక్కసారి రెన్యువల్ కోసం 50 వేల ఇలా ప్రతి ఏటా రాష్ట్ర ప్రభుత్వానికి చెల్లించాల్సి ఉంటుంది. ఈ మొత్తాన్ని చెల్లించకుండా ప్లాంట్ల నిర్వాహకులు సంబంధిత శాఖలోని కొంతమంది అధికారులకు ముడుపులు చెల్లించి. ఇష్టానుసారం నీటి విక్రయిస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు. నిబంధనలకు విరుద్ధంగా జిల్లాలో కొనసాగుతున్న వాటర్ ప్లాంట్లను సీజ్ చేసి యాజమాన్యాల పై చర్యలు తీసుకోవాల్సిన అధికారులు మామూళ్ల మత్తులో పట్టించుకోకుండా వ్వవహరిస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికే అధికారులు స్పందించి వాటర్ ప్లాంట్లను తనిఖీ చేసి నిబంధనలకు విరుద్ధంగా నిర్వహిస్తున్న ప్లాంట్లను చర్యలు తీసుకొని ప్రజల ఆరోగ్యాలను కాపాడాలని ప్రజా సంఘాల నాయకులు కోరుతున్నారు.






