- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఆదిలోనే లొల్లి.. కుర్చి వేయకుండా అవమానించారంటూ..!
దిశ, వాంకిడి : వాంకిడి మేజర్ గ్రామ పంచాయతీ పాలకవర్గ సమావేశంలో ఉద్రిక్తత నెలకొంది. కూర్చోవడానికి కుర్చీలు ఇవ్వకుండా అధికారులు

దిశ, వాంకిడి : వాంకిడి మేజర్ గ్రామ పంచాయతీ పాలకవర్గ సమావేశంలో ఉద్రిక్తత నెలకొంది. కూర్చోవడానికి కుర్చీలు ఇవ్వకుండా అధికారులు తమను అవమానించారంటూ మహిళా వార్డు సభ్యులు గ్రామ కార్యదర్శి శివ్ కుమార్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రమాణస్వీకారానికి ముందు స్టేజ్ పై 15 కుర్చీలు వేశారు అధికారులు.. సర్పంచ్ ప్రమాణస్వీకారానికి రాగానే తాము కూర్చోవాల్సిన 7 కుర్చీలను అధికారులు తీసేశారని వార్డు సభ్యులు మండిపడ్డారు. మేము వార్డు సభ్యులం కాదా అంటూ నిలదీశారు. స్థానికులు కొందరు కల్పించుకోవడంతో తీవ్ర వాగ్వివాదం చోటు చేసుకుంది. కాసేపు సమావేశంలో ఉద్రిక్తత నెలకొంది. 22న ముహూర్తం బాగులేక ప్రమాణస్వీకారానికి దూరంగా ఉన్న సర్పంచ్.. ఏడుగురు వార్డు సభ్యులు బుధవారం ప్రమాణ స్వీకారం చేశారు. ఈ క్రమంలో లొల్లి జరిగింది. ఇక 10 వార్డు సభ్యురాలు ప్రమాణస్వీకారానికి స్టేజీపైకి రాగా సర్పంచ్ బీఆర్ఎస్ మద్దతుదారులు ఆమెను ఉప సర్పంచ్ జిందాబాద్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. కాంగ్రెస్ అభ్యర్థి ఉప సర్పంచ్ ఉండగానే ఆమె ఉప సర్పంచ్ అంటూ నినాదాలు చేయడం స్థానికులను ఆశ్చర్యానికి గురైయ్యారు. ఆదిలోనే వర్గ విభేదాలు దర్శనమివ్వడంతో ఐదేళ్లు పంచాయతీ అభివృద్ధి ఏ విధంగా కొనసాగుతుందన్న ప్రశ్నలు స్థానిక జనాల్లో ఉత్పన్నమవుతున్నాయి.






